- థాయ్‌లాండ్, సింగపూర్, మలేషియా మీదుగా అక్రమ రవాణా
- నకిలీ కంపెనీలు, నకిలీ లేబుల్స్..
- రూ. వేల కోట్ల దందాపై దర్యాప్తు
వెలుగు డెస్క్: ఇరవయ్యో శతాబ్దంలో చమురు కోసం యుద్ధాలు జరిగాయి. ఇప్పుడు ఓ చిన్న సిలికాన్ చిప్ కోసం ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో ఆధిపత్యం కోసం అమెరికా, చైనా మధ్య సాగుతున్న పోరులో ఇప్పుడు స్మగ్లింగ్ వివాదం కలకలం రేపుతోంది. అమెరికా ఎగుమతులు నిషేధించిన ఎన్విడియా ఏఐ చిప్స్ దొంగచాటుగా చైనాకు చేరుతున్నాయన్న ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారాయి.
రూ.2,850 కోట్ల సర్వర్లు చైనాకు
300 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.2,850 కోట్లు) విలువైన ఏఐ చిప్స్ ఉన్న సర్వర్లను అమెరికా ఎగుమతి చట్టాలకు విరుద్ధంగా చైనాకు తరలించాడన్న ఆరోపణలపై గ్రెగ్ లూయి అనే వ్యక్తిని అక్టోబర్ 1న అమెరికా న్యాయశాఖ అరెస్ట్ చేసింది. ఇది ఒక్క కేసే కాదు. పశ్చిమ చైనాలో నిషేధిత 1,15,000 ఎన్విడియా ప్రాసెసర్లు పట్టేంత డేటా సెంటర్లు నిర్మిస్తున్నారని, కొన్ని చిప్స్ ఇప్పటికే చైనాకు స్మగ్లింగ్ అయ్యాయని అమెరికా అధికారులు భావిస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్ వార్తాసంస్థ వెల్లడించింది.
మలేసియా, సింగపూర్ మీదుగా..
స్మగ్లర్లు నేరుగా చైనాకు కాకుండా పొరుగు దేశాల మీదుగా చిప్స్ తరలిస్తున్నారు. గ్రెగ్ లూయి కేసులో, కాలిఫోర్నియాలోని ఆయన కంపెనీ ‘ఎర్త్‌మేడ్ కంప్యూటర్’ అమెరికా తయారీదారుల నుంచి సర్వర్లు కొని, అత్యాధునిక ఏఐ చిప్స్ కొనడానికి లైసెన్స్ అవసరం లేని మలేసియా, సింగపూర్‌లకు ముందుగా పంపి, అక్కడినుంచి నకిలీ పత్రాలతో చైనాకు చేర్చిందని ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు. 2024లో మలేసియాకు చెందిన రెండు షిప్పింగ్ కంపెనీల నుంచి ఆ సంస్థకు 176 మిలియన్ డాలర్లకు పైగా అందాయని అభియోగపత్రంలో పేర్కొన్నారు. ఎగుమతి నియంత్రణ చట్టాల ఉల్లంఘన, స్మగ్లింగ్, మనీ లాండరింగ్ అభియోగాలు రుజువైతే లూయికి 20 ఏండ్లకు పైగా జైలు శిక్ష పడొచ్చు.
హెయిర్ డ్రయర్‌తో లేబుల్స్ తొలగింపు
మరో కేసులో సర్వర్ల తయారీ సంస్థ సూపర్ మైక్రో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సహా ముగ్గురిపై అమెరికా న్యాయశాఖ అభియోగాలు మోపింది. బ్యాంకాక్‌కు చెందిన ‘ఓబాన్’ అనే సంస్థకు థాయ్‌లాండ్‌లో ఏఐ మౌలిక సదుపాయాల పేరుతో దాదాపు 2.5 బిలియన్ డాలర్ల సర్వర్లు అమ్మగా, అందులో 510 మిలియన్ డాలర్లకు పైగా విలువైన సర్వర్లు నేరుగా చైనాకు చేరాయని ఆరోపణ. తనిఖీలకు వచ్చిన అధికారులను మోసం చేసేందుకు నకిలీ లేబుల్స్ అతికించిన డమ్మీ సర్వర్ల ఫొటోలు, వీడియోలు పంపారని ప్రాసిక్యూటర్లు చెబుతున్నారు.
ఓ వ్యక్తి ఎర్ర రంగు హెయిర్ డ్రయర్‌తో ఎన్విడియా సర్వర్ బాక్సులపై సీరియల్ నంబర్ స్టిక్కర్లు ఊడదీస్తున్న సీసీటీవీ వీడియోను కూడా అధికారులు విడుదల చేశారు. గతేడాది నవంబర్‌లో అలబామా నుంచి మలేసియా, థాయ్‌లాండ్ మీదుగా 400 ఎన్విడియా ఏ100 జీపీయూలను చైనాకు తరలించిన నలుగురిని అరెస్ట్ చేశారు.
వెలుగు డెస్క్: ఇరవయ్యో శతాబ్దంలో చమురు కోసం యుద్ధాలు జరిగాయి. ఇప్పుడు ఓ చిన్న సిలికాన్ చిప్ కోసం ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో ఆధిపత్యం కోసం అమెరికా, చైనా మధ్య సాగుతున్న పోరులో ఇప్పుడు స్మగ్లింగ్ వివాదం కలకలం రేపుతోంది. అమెరికా ఎగుమతులు నిషేధించిన ఎన్విడియా ఏఐ చిప్స్ దొంగచాటుగా చైనాకు చేరుతున్నాయన్న ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారాయి.
రూ.2,850 కోట్ల సర్వర్లు చైనాకు
300 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.2,850 కోట్లు) విలువైన ఏఐ చిప్స్ ఉన్న సర్వర్లను అమెరికా ఎగుమతి చట్టాలకు విరుద్ధంగా చైనాకు తరలించాడన్న ఆరోపణలపై గ్రెగ్ లూయి అనే వ్యక్తిని అక్టోబర్ 1న అమెరికా న్యాయశాఖ అరెస్ట్ చేసింది. ఇది ఒక్క కేసే కాదు. పశ్చిమ చైనాలో నిషేధిత 1,15,000 ఎన్విడియా ప్రాసెసర్లు పట్టేంత డేటా సెంటర్లు నిర్మిస్తున్నారని, కొన్ని చిప్స్ ఇప్పటికే చైనాకు స్మగ్లింగ్ అయ్యాయని అమెరికా అధికారులు భావిస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్ వార్తాసంస్థ వెల్లడించింది.
మలేసియా, సింగపూర్ మీదుగా..
స్మగ్లర్లు నేరుగా చైనాకు కాకుండా పొరుగు దేశాల మీదుగా చిప్స్ తరలిస్తున్నారు. గ్రెగ్ లూయి కేసులో, కాలిఫోర్నియాలోని ఆయన కంపెనీ ‘ఎర్త్‌మేడ్ కంప్యూటర్’ అమెరికా తయారీదారుల నుంచి సర్వర్లు కొని, అత్యాధునిక ఏఐ చిప్స్ కొనడానికి లైసెన్స్ అవసరం లేని మలేసియా, సింగపూర్‌లకు ముందుగా పంపి, అక్కడినుంచి నకిలీ పత్రాలతో చైనాకు చేర్చిందని ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు. 2024లో మలేసియాకు చెందిన రెండు షిప్పింగ్ కంపెనీల నుంచి ఆ సంస్థకు 176 మిలియన్ డాలర్లకు పైగా అందాయని అభియోగపత్రంలో పేర్కొన్నారు. ఎగుమతి నియంత్రణ చట్టాల ఉల్లంఘన, స్మగ్లింగ్, మనీ లాండరింగ్ అభియోగాలు రుజువైతే లూయికి 20 ఏండ్లకు పైగా జైలు శిక్ష పడొచ్చు.
హెయిర్ డ్రయర్‌తో లేబుల్స్ తొలగింపు
మరో కేసులో సర్వర్ల తయారీ సంస్థ సూపర్ మైక్రో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సహా ముగ్గురిపై అమెరికా న్యాయశాఖ అభియోగాలు మోపింది. బ్యాంకాక్‌కు చెందిన ‘ఓబాన్’ అనే సంస్థకు థాయ్‌లాండ్‌లో ఏఐ మౌలిక సదుపాయాల పేరుతో దాదాపు 2.5 బిలియన్ డాలర్ల సర్వర్లు అమ్మగా, అందులో 510 మిలియన్ డాలర్లకు పైగా విలువైన సర్వర్లు నేరుగా చైనాకు చేరాయని ఆరోపణ. తనిఖీలకు వచ్చిన అధికారులను మోసం చేసేందుకు నకిలీ లేబుల్స్ అతికించిన డమ్మీ సర్వర్ల ఫొటోలు, వీడియోలు పంపారని ప్రాసిక్యూటర్లు చెబుతున్నారు. ఓ వ్యక్తి ఎర్ర రంగు హెయిర్ డ్రయర్‌తో ఎన్విడియా సర్వర్ బాక్సులపై సీరియల్ నంబర్ స్టిక్కర్లు ఊడదీస్తున్న సీసీటీవీ వీడియోను కూడా అధికారులు విడుదల చేశారు. గతేడాది నవంబర్‌లో అలబామా నుంచి మలేసియా, థాయ్‌లాండ్ మీదుగా 400 ఎన్విడియా ఏ100 జీపీయూలను చైనాకు తరలించిన నలుగురిని అరెస్ట్ చేశారు.
ఎందుకీ నిషేధం?
ఎన్విడియా తయారు చేసే జీపీయూ చిప్స్ ఏఐకి గుండెకాయ లాంటివి. చాట్‌జీపీటీ వంటి ఏఐ మోడల్స్ తయారీకి వేలాది చిప్స్ కావాలి. అందుకే అమెరికా టెక్నాలజీతో తయారైన అడ్వాన్స్‌డ్ చిప్స్ చైనాకు చేరకుండా 2022లో అమెరికా ఎగుమతి నియంత్రణలు విధించింది. ఈ చిప్స్ చైనా సైన్యాన్ని బలోపేతం చేసి తమ జాతీయ భద్రతకు ముప్పుగా మారతాయనేది అమెరికా ఆందోళన. ‘ఈ చిప్స్‌ను నియంత్రించే దేశమే ఏఐని నియంత్రిస్తుంది. ఏఐని నియంత్రించే దేశమే భవిష్యత్తును శాసిస్తుంది’ అని టెక్సాస్‌కు చెందిన ఓ ఫెడరల్ అటార్నీ వ్యాఖ్యానించారు.
ఎన్విడియాపై ప్రశ్నలు
చైనా పొరుగున ఉన్న థాయ్‌లాండ్, సింగపూర్ వంటి దేశాలు అవసరానికి మించి చిప్స్ కొంటున్నా ఎన్విడియా ఈ హెచ్చరిక సంకేతాలను పట్టించుకోలేదని అమెరికా అధికారులు అంటున్నారు. చైనా కస్టమర్లకు కాకపోతే ఆగ్నేయాసియాకు ఇన్ని చిప్స్ ఎలా వెళ్తున్నాయో ఎప్పుడూ సూటిగా సమాధానం రాలేదని అమెరికా విదేశాంగ శాఖ ఏఐ పాలసీ మాజీ అధిపతి డేనియల్ రెమ్లర్ అన్నారు.
అయితే స్మగ్లర్లకు సహకరించినట్లు ఎన్విడియాపై ఎప్పుడూ ఆరోపణలు లేవు. తాము అన్ని నిబంధనలూ పాటించామని కంపెనీ చెబుతోంది. ఎన్విడియా క్లయింట్ అయిన సింగపూర్ సంస్థ మెగాస్పీడ్ ఎగ్జిక్యూటివ్‌తో సంబంధాల వివాదం నేపథ్యంలో సీఈవో జెన్సన్ హువాంగ్ గురువారం రాజీనామా చేయడంతో, చిప్స్ స్మగ్లింగ్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది.
