చుక్కల్లో రిటైల్ ధరలు..రెండేళ్ల గరిష్టానికి ద్రవ్యోల్బణం

చుక్కల్లో రిటైల్ ధరలు..రెండేళ్ల గరిష్టానికి ద్రవ్యోల్బణం
  • అక్టోబర్‌‌లో 6.09 శాతం  
  • ఆహార ధరలు పెరగడమే కారణం
  • ఉల్లి ధరలు 116 శాతం జంప్​
  • వడ్డీ రేట్ల పెంపునకు అవకాశం

న్యూఢిల్లీ: రిటైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్రవ్యోల్బణం మరోసారి ఆందోళనకర స్థాయికి చేరింది. గత నెల అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 6.09 శాతానికి చేరింది. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది 5.54 శాతం ఉంది.  ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ నిర్దేశించిన 6 శాతం గరిష్ఠ పరిమితిని రెండేళ్ల తర్వాత తొలిసారిగా దాటింది. తెలంగాణ సహా ఏడు రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణం ఆరు శాతం దాటింది. ఆహార పదార్థాల ధరల దూకుడు ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణమైంది. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 7.74 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 8.94 శాతానికి చేరింది. 

అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉల్లి ధరలు ఏకంగా 116.22 శాతం, వెల్లుల్లి 60.74 శాతం, వెండి నగలు 52.39 శాతం, అల్లం 48.32 శాతం, నిమ్మకాయ ధరలు 47.30 శాతం పెరిగాయి. మొత్తం 12 విభాగాల్లో 11 విభాగాల్లో ధరలు దూసుకెళ్లాయి. రెస్టారెంట్లు, వసతి సేవల విభాగంలో ద్రవ్యోల్బణం 10.06 శాతంగా ఉంది. ఈ పరిస్థితుల్లో  ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశంలో మరోసారి వడ్డీ రేట్ల పెంపు ఉండవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో 0.25 శాతం రెపో రేటు పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

ప్రస్తుతం రెపో రేటు 5.50 శాతంగా ఉంది. వడ్డీ రేట్లు పెరిగితే గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై ఈఎంఐ భారం పెరిగే అవకాశం ఉంది. బలహీనమైన రుతుపవనాలు, రబీ పంటల దిగుబడిపై ఆందోళనలు ఆహార ధరలపై మరింత ప్రభావం చూపవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.