హైదరాబాద్, వెలుగు: నగర రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో లావాదేవీల సంఖ్య స్వల్పంగా తగ్గినా, ఆస్తుల విలువ మాత్రం పెరుగుతోంది. నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం 2026 జనవరి నుంచి అక్టోబర్ వరకు హైదరాబాద్‌లో 61,033 నివాస ఆస్తులు రిజిస్టర్ అయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రిజిస్ట్రేషన్లు 1 శాతం తగ్గాయి. అయితే వీటి మొత్తం విలువ 3 శాతం పెరిగి రూ.44,305 కోట్లకు చేరింది.
అక్టోబర్‌లో 5,318 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. రూ. కోటి కంటే ఎక్కువ ధర ఉన్న ఇళ్ల వాటా మొత్తం రిజిస్ట్రేషన్లలో 25 శాతంగా నమోదైంది. అక్టోబర్‌లో చదరపు అడుగు సగటు ధర 10 శాతం పెరిగి రూ.5,184కు చేరిందని నైట్‌ఫ్రాంక్ తెలిపింది.
