నేడే జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం.. రాష్ట్రపతి భవన్‌లో వేడుక!  

నేడే జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం.. రాష్ట్రపతి భవన్‌లో వేడుక!  

National Sports Awards 2025: ఏడాదికి పైగా ఆలస్యమైన 2025 జాతీయ క్రీడా పురస్కారాల (National Sports Awards) ప్రదానోత్సవానికి ఎట్టకేలకు వేళైంది. ఈరోజు (2026, నవంబర్ 13, శుక్రవారం ) ఉదయం 11:30 గంటలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎంపికైన క్రీడాకారులు, కోచ్‌లకు అవార్డులను అందజేయనున్నారు. ఈ వేడుకలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా పాల్గొననున్నారు. కాగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ (రిటైర్డ్) అరుణ్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని కమిటీ గతేడాది డిసెంబర్ 24న 24 మంది పేర్లను సిఫార్సు చేయగా, క్రీడా మంత్రిత్వ శాఖ ఏడుగురి పేర్లను తొలగించి ఆగస్టు 18న 17 మందితో తుది అర్జున అవార్డుల జాబితాను ప్రకటించింది.

ఈసారి నో ఖేల్ రత్న: 

* ఖేల్ రత్న లేకుండానే: ఈసారి అత్యున్నత క్రీడా పురస్కారమైన 'మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న' అవార్డుకు ఎంపిక కమిటీ ఎవరి పేరునూ సిఫార్సు చేయలేదు.

* తెలుగు తేజాలకు గుర్తింపు: బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ గాయత్రి గోపీచంద్, డెఫ్ షూటర్ ధనుష్ శ్రీకాంత్ అర్జున అవార్డులు అందుకోనున్నారు.

2025 జాతీయ క్రీడా పురస్కారాల పూర్తి జాబితా:

అర్జున అవార్డు (17 మంది క్రీడాకారులు):

* బ్యాడ్మింటన్: గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీ

* చెస్: విదిత్ గుజరాతీ, దివ్య దేశ్‌ముఖ్

* అథ్లెటిక్స్: తేజస్విన్ శంకర్, ప్రియాంక గోస్వామి, మహ్మద్ అజ్మల్ వి

* షూటింగ్: అఖిల్ షెరాన్, ధనుష్ శ్రీకాంత్ (డెఫ్ షూటింగ్), రుద్రాంశ్ ఖండేల్వాల్ (పారా షూటింగ్)

* హాకీ: రాజ్‌కుమార్ పాల్, లాల్రెమ్సియామి హ్మార్ జోట్

* కబడ్డీ: సుర్జీత్, పూజ

* బాక్సింగ్: నరేందర్

* రోయింగ్: అరవింద్ సింగ్

* పారా-అథ్లెటిక్స్: ఏక్తా భయాన్

అర్జున అవార్డు (లైఫ్‌టైమ్):

* ఐ. అరుమై నాయగం (ఫుట్‌బాల్)

ద్రోణాచార్య అవార్డు (రెగ్యులర్ కేటగిరీ):

* పర్వీర్ సింగ్ (అథ్లెటిక్స్), ఛోటే లాల్ యాదవ్ (బాక్సింగ్), నేహా చవాన్ (షూటింగ్)

ద్రోణాచార్య అవార్డు (లైఫ్‌టైమ్ కేటగిరీ):

* ధర్మేంద్ర సింగ్ యాదవ్ (బాక్సింగ్), వీరేందర్ కుమార్ (రెజ్లింగ్)

రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్:

* ఆర్మీ పారాలింపిక్ నోడ్, పూణే (Army Paralympic Node, Pune)