ప్రశాంతంగా డిప్యూటీ ఈవో, గెజిటెడ్ హెచ్ఎం ఎగ్జామ్

ప్రశాంతంగా డిప్యూటీ ఈవో,  గెజిటెడ్ హెచ్ఎం ఎగ్జామ్

హైదరాబాద్, వెలుగు: స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ (డిప్యూటీ ఈవో), గెజిటెడ్ హెడ్ మాస్టర్ (జీహెచ్ఎం) గ్రేడ్–-1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ఆన్‌లైన్ పరీక్ష మొదటి రోజు ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 50 పరీక్షా కేంద్రాల్లో గురువారం ఈ ఎగ్జామ్‌ను నిర్వహించారు. మొదటి రోజు పరీక్షకు కేటాయించిన మొత్తం17,630 మంది అభ్యర్థులలో, ఉదయం సెషన్ పేపర్–-1కు 11,448 మంది, మధ్యాహ్నం సెషన్ పేపర్-–2కు11,409 మంది హాజరైనట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి హరిత ఒక ప్రకటనలో వెల్లడించారు.