రన్ వేపై ట్రైనీ విమానంస్కిడ్.. సోలాపూర్ ఎయిర్ పోర్టులో తప్పిన ప్రమాదం

రన్ వేపై ట్రైనీ విమానంస్కిడ్.. సోలాపూర్ ఎయిర్ పోర్టులో తప్పిన ప్రమాదం

సోలాపూర్: మహారాష్ట్రలోని సోలాపూర్ ఎయిర్‌‌‌‌పోర్టులో గురువారం టేకాఫ్ సమయంలో ఓ ట్రైనీ విమానం రన్​వే పై స్కిడ్​అయింది. ఒక్కసారిగా అదుపుతప్పి పక్కకు దూసుకెళ్లింది. అయితే, విమానం గాల్లోకి ఎగరకముందే ఈ ఘటన జరగడంతో పెను ప్రమాదం తప్పింది. విమానం నడుపుతున్న మహిళా ట్రైనీ పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. 

ఆమె ఒక్కరే ఈ ఫ్లైట్‌‌‌‌లో ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్​సిబ్బంది, అత్యవసర సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని భద్రతా చర్యలు చేపట్టాయి. సాంకేతిక లోపమా లేక మరేదైనా కారణమా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.