టాక్సిక్ ట్రోలింగ్‌‌ పై కియారా రియాక్షన్‌‌..

టాక్సిక్ ట్రోలింగ్‌‌ పై కియారా రియాక్షన్‌‌..

బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ తన రీసెంట్ మూవీ ‘టాక్సిక్’ వైఫల్యం, యశ్‌‌తో కలిసి నటించిన బోల్డ్ సీన్స్‌‌పై వచ్చిన విమర్శల గురించి తొలిసారిగా మనసు విప్పి మాట్లాడింది. కరణ్ జోహార్ హోస్ట్‌‌గా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొన్న ఆమె, ఈ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంది.  ఆ సినిమా ఫలితం అంతలా నిరాశపరుస్తుందని తమ టీమ్‌‌లో ఎవరూ ఊహించలేదని,  ముఖ్యంగా ఫస్ట్ వీకెండ్‌‌ రిజల్ట్ చూశాక హార్ట్ బ్రేకింగ్‌‌గా అనిపించి కుంగిపోయానని ఆమె చెప్పింది. 

అయితే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి పోషించిన ‘నాడియా’ పాత్రకు ప్రశంసలు రావడం ఊరటను ఇచ్చిందని,  తన కెరీర్‌‌‌‌లో ఆ పాత్ర ఓ కీలక మలుపుగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక యశ్‌‌తో ఉన్న ఇంటిమేట్ సన్నివేశాలపై సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్‌‌ను తన భర్త సిద్ధార్థ్ మల్హోత్రా అసలు పట్టించుకోలేదని,  కనీసం ఆ ప్రస్తావన కూడా తమ మధ్య రాలేదని కియారా స్పష్టం చేసింది. 

గతంలో ఐశ్వర్య రాయ్ లాంటి హీరోయిన్స్‌‌ కూడా ఇలాంటి ట్రోలింగ్‌‌ను ఎదుర్కొన్నారని, అయినా ఆ హిపోక్రసీని నెటిజన్స్‌‌ ఎండగట్టారు కనుక తాను స్పందించలేదని కియారా చెప్పింది.