డిఫరెంట్ స్ర్కిప్ట్‌లను సెలెక్ట్ చేసుకుంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న అల్లరి నరేష్.. మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘ఆల్కహాల్’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి మెహర్ తేజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమాను డిసెంబర్ 18న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. కిస్మస్ సెలవులను దృష్టిలో పెట్టుకుని ఈ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు.
మానవ ప్రవర్తనలోని విభిన్న కోణాలు, నేర ప్రవృత్తి, మనిషి తీసుకునే నిర్ణయాలు వాటి పర్యవసానాల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. రుహానీ శర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా, నిహారిక ఎన్‌ఎం, సత్య, గిరీష్ కులకర్ణి, హర్షవర్ధన్, చైతన్య కృష్ణ, రవీంద్ర విజయ్, రఘుబాబు, వెంకటేష్ కాకుమాను, కిరీటి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచగా, త్వరలోనే మరిన్ని ప్రమోషనల్ కంటెంట్‌ను ఆడియన్స్‌కు అందించనున్నట్టు మేకర్స్ తెలియజేశారు. జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా, చేతన్ భరద్వాజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ఇస్తున్నాడు.
