సుధాకర్ కోమాకుల హీరోగా రూపొందుతున్న చిత్రం ‘డైరెక్టెడ్ బై చార్లీ చాప్లిన్’. శ్రీ విఘ్నేశ్వర ప్రొడక్షన్స్, సుఖ మీడియా బ్యానర్స్‌పై మనర్తి విఘ్నేష్ నిర్మిస్తున్నారు. ఇటీవల ఆది సాయికుమార్ హీరోగా ‘ఎస్‌ఐ యుగంధర్’ చిత్రాన్ని రూపొందించిన రాఘవేంద్ర కటారి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. గురువారం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఇందులో చార్లీ చాప్లిన్ గెటప్‌లో సుధాకర్ కోమాకుల కనిపించాడు. జీవితమే ఒక డ్రామెడీ అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలోని కొంత భాగంలో దిగ్గజ హాస్యనటుడు చార్లీ చాప్లిన్‌గా సుధాకర్ కనిపించబోతున్నారు.
ఈ పాత్ర కోసం చార్లీ చాప్లిన్ హావభావాలు, బాడీ లాంగ్వేజ్, మ్యానరిజమ్స్‌ను సుధాకర్ ప్రత్యేకంగా అధ్యయనం చేశాడని, ఆ పాత్ర ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రారంభించి, ఇతర వివరాలను తెలియజేస్తామన్నారు.
