బ్రెజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో స్కైరూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీలక ఒప్పందం..100 కిలోల ఉపగ్రహాల ప్రయోగం

బ్రెజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో స్కైరూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీలక ఒప్పందం..100 కిలోల ఉపగ్రహాల ప్రయోగం

న్యూఢిల్లీ: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన అంతరిక్ష రంగ స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కైరూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏరోస్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రెజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థ కాన్సర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కీలక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. కనీసం 100 కిలోల బరువున్న ఉపగ్రహాలను లో ఎర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్బిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈఓ)లోకి పంపగల ప్రయోగ వాహనాన్ని అభివృద్ధి చేయడమే ఈ భాగస్వామ్యం లక్ష్యం. టర్కీలోని అంటాల్యాలో జరిగిన అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2026 సందర్భంగా కాన్సర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఈఓ రఫేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోర్డెంటే ఈ ఒప్పందంపై సంతకం చేశారు. 

బ్రెజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మైక్రోలాంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్యక్రమం ప్రస్తుతం 40 కిలోల వరకు బరువున్న ఉపగ్రహాలను మోసుకెళ్లే సామర్థ్యంతో రూపొందుతోంది. స్కైరూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విక్రమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాకెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రేణితో ఈ సామర్థ్యాన్ని మరింత పెంచాలని రెండు సంస్థలు భావిస్తున్నాయి. భూమధ్యరేఖ ప్రాంతం నుంచి ఉపగ్రహ ప్రయోగాల అవకాశాలను కూడా పరిశీలించనున్నాయి. స్కైరూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ ఏడాది జులైలో విక్రమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-01ను కక్ష్యలోకి పంపింది.