మౌళి తనూజ్ హీరోగా నటించిన చిత్రం ‘డీఎన్‌కే’. శ్రీను కంబాల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ నిర్మించారు. శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హీరో శ్రీవిష్ణు సినిమా సక్సెస్ సాధించాలని కోరుతూ టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు. కార్యక్రమంలో పాల్గొన్న దర్శకులు శివ నిర్వాణ, బుచ్చిబాబు, వివేక్ ఆత్రేయ ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరారు.
మౌళి మాట్లాడుతూ ‘మైత్రీ సంస్థలో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. వాళ్లకు చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా ఉండదు. ఎంతో ఆప్యాయంగా ఉంటారు. ఈ ఎక్స్‌పీరియన్స్ నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. ఈ చిత్రం ప్రేక్షకులను కచ్చితంగా ఎంటర్‌టైన్ చేస్తుంది’ అని చెప్పాడు.
సినిమా అవుట్‌పుట్ చాలాబాగా వచ్చిందని, సక్సెస్‌పై కాన్ఫిడెంట్‌గా ఉన్నామని దర్శకుడు శ్రీను కంబాల చెప్పాడు. ఈ సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని నిర్మాత రవిశంకర్ అన్నారు. ఈ మూవీ అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుందని హీరోయిన్ సుస్మిత శెట్టి, నటీనటులు అలీ, రజిత, మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ యెర్రమిల్లి అన్నారు.
