ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) గ్రూప్–ఏ గెజిటెడ్ ఆఫీసర్ కొలువుల భర్తీకి సంబంధించి ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్‌సీఏటీ 1/2027) నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్, నాన్-–టెక్నికల్) విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు డిసెంబర్ 11 వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 284.
విభాగాల వారీగా ఖాళీలు
- ఫ్లయింగ్ బ్రాంచ్ (36): షార్ట్ సర్వీస్ కమిషన్ 28 (పురుషులు), 8 (మహిళలు).
- గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ (124): ఏరో నాటికల్ ఇంజినీర్ ఎలక్ట్రానిక్స్– ఏఈ (ఎల్) 88, ఏరో నాటికల్ ఇంజినీర్ మెకానికల్ ఏఈ (ఎల్) 88.
- గ్రౌండ్ డ్యూటీ నాన్ – టెక్నికల్ (108): వెపన్ సిస్టమ్స్ 30, అడ్మినిస్ట్రేషన్ 53, లాజిస్టిక్స్ 11, అకౌంట్స్ 8, ఎడ్యుకేషన్ 4, మెటియరాలజీ 2.
- గేట్ స్కోర్ ఎంట్రీ – గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ (16): ఏఈ (ఎల్) – ఎలక్ట్రానిక్స్ 11, ఏఈ (ఎం) – మెకానికల్ 5.
విద్యార్హతలు
- ఫ్లయింగ్ బ్రాంచ్: ఇంటర్మీడియట్ (10+2) స్థాయిలో గణితం, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో చదివి ఉండాలి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మూడేళ్ల డిగ్రీ కోర్సు పూర్తిచేసి ఉండాలి. లేదా బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి.
- ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ లేదా ఏరో నాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వహించే సెక్షన్ 'ఏ', 'బీ' పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారూ అప్లై చేసుకోవడానికి అర్హులు.
- ఏరోనాటికల్ ఇంజినీర్ - ఎలక్ట్రానిక్స్ (ఏఈ (ఎల్): ఇంటర్మీడియట్ (10+2) స్థాయిలో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి. దీంతోపాటు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇనుస్ట్రుమెంటేషన్, రోబోటిక్స్ సంబంధిత ఇంజినీరింగ్ స్పెషలైజేషన్లు చేసిన వారు అర్హులు.
- బీఎస్సీ ఫిజిక్స్‌తోపాటు ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ పూర్తిచేసి ప్రత్యామ్నాయ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్ పరీక్షలు పాసైన వారూ అప్లై చేసుకోవచ్చు.
- ఏరో నాటికల్ ఇంజినీర్ - మెకానికల్ (ఏఈ(ఎం): ఇంటర్మీడియట్ స్థాయిలో ఫిజిక్స్, మ్యాథ్స్ చదివి ఉండాలి. సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి.
గ్రౌండ్ డ్యూటీ నాన్- టెక్నికల్: ఇంటర్మీడియట్ (10+2) స్థాయిలో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి. అలాగే, సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, బీఈ/ బి.టెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి.
వయసు: (2028, జనవరి 1 నాటికి)
- ఫ్లయింగ్ బ్రాంచ్: 20 నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి. డీజీసీఏ జారీ చేసి చెల్లుబాటులో ఉన్న కమర్షియల్ పైలెట్ లైసెన్స్ కలిగి ఉంటే వారి వయోపరిమితిని 26 సంవత్సరాల వరకు సడలిస్తారు.
- మిగతా పోస్టులకు 20 నుంచి 26 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎలాంటి వయో సడలింపులు ఉండవు.
- సెలెక్షన్ ప్రాసెస్: ఆన్లైన్ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఎయిర్ ఫోర్స్ సెలెక్షన్ బోర్డ్ (ఏఎఫ్ఎఫ్బీ) పరీక్షలకు ఆహ్వానిస్తారు. ఈ దశలో అభ్యర్థుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్ (ఓఐఆర్), సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
- ఫ్లయింగ్ బ్రాంచ్ అభ్యర్థులు అదనంగా కంప్యూటరైజ్డ్ పైలెట్ సెలెక్షన్ సిస్టమ్ (సీపీఎస్ఎస్) పరీక్షలో అర్హత సాధించడం తప్పనిసరి.
- మరిన్ని వివరాలకు వెబ్సైట్ afcat.edcil.co.inను సందర్శించండి.
ఏఎఫ్‌సీఏటీ ఎగ్జామ్ ప్యాటర్న్
ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించే ఎగ్జామ్‌లో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలు 300 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 120 నిమిషాల్లో పూర్తిచేయాలి. పరీక్ష కేవలం ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 3 మార్కులు ఇస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు.
ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ – 2027
- అర్హతలు: అభ్యర్థులు ఏఎఫ్‌సీఏటీ రిజిస్ట్రేషన్ తేదీకి ముందు నిర్దిష్ట రెండేళ్ల కాలపరిమితిలోపు ఎన్‌సీసీ ఎయిర్ వింగ్ సీనియర్ డివిజన్ 'సి' సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- రాత పరీక్ష మినహాయింపు: ఎన్‌సీసీ ప్రత్యేక ప్రవేశానికి అర్హత సాధించిన అభ్యర్థులకు ఏఎఫ్‌సీఏటీ రాత పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. వీరిని నేరుగా ఎయిర్ ఫోర్స్ సెలెక్షన్ బోర్డ్ (ఏఎఫ్ఎస్ బీ) పరీక్షలకు ఆహ్వానిస్తారు.
- అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
- అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 12.
- అప్లికేషన్ ఫీజు: ఏఎఫ్‌సీఏటీ ఎంట్రీ అభ్యర్థులు రూ. 649 చెల్లించాలి. ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ, గేట్ స్కోర్ ఎంట్రీ అభ్యర్థులకు ఫీజు ఉండదు.
- లాస్ట్ డేట్: డిసెంబర్ 11.
- ఎగ్జామినేషన్ తేదీ: 2027, జనవరి 31.
- ట్రైనింగ్ ప్రారంభం: 2028, జనవరి మొదటివారం
గేట్ స్కోర్ ఎంట్రీ – 2027
- అర్హత: ఏరోనాటికల్ ఇంజినీర్ - ఎలక్ట్రానిక్స్, ఏరోనాటికల్ ఇంజినీర్ - మెకానికల్ విభాగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- విద్యార్హత: అభ్యర్థులు నిర్దేశిత ఇంజినీరింగ్ విభాగాల్లో బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి. అలాగే, సంబంధిత గేట్ సబ్జెక్టులో కచ్చితంగా అర్హత సాధించి ఉండాలి.
- గేట్ స్కోర్ కాలపరిమితి: 2024, జనవరి 1 నుంచి 2027, డిసెంబర్ 31 మధ్య కాలానికి చెల్లుబాటు అయ్యేలా ఉండాలి.
- ఎంపిక విధానం: అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో తమ గేట్ స్కోర్ వివరాలు, దానికి సంబంధించిన విద్యార్హత ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.ఈ ఎంట్రీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను నిర్ణీత షార్ట్‌లిస్టింగ్ విధానం ఆధారంగా ఎయిర్ ఫోర్స్ సెలెక్షన్ బోర్డ్ (ఏఎఫ్ఎస్ బీ) పరీక్షలకు ఎంపిక చేస్తారు.
సిలబస్
- జనరల్ అవేర్‌నెస్: చరిత్ర, భూగోళశాస్త్రం, కరెంట్ అఫైర్స్, భారతీయ రాజకీయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, రక్షణ రంగం, సైన్స్ అండ్ టెక్నాలజీ, క్రీడలు, పర్యావరణం.
- ఇంగ్లిష్ వెర్బల్ ఎబిలిటీ: అభ్యర్థుల ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలను పరీక్షించేందుకు కాంప్రహెన్షన్, పద సంపద, సమానార్థకాలు, వ్యతిరేక పదాలు, వ్యాకరణం, వాక్య సవరణ, జాతీయాలు, క్లోజ్ టెస్ట్, వాక్యాల అమరిక.
- సంఖ్యా సామర్థ్యం: శాతాలు, సరాసరి, లాభనష్టాలు, నిష్పత్తులు, కాలం–-పని, వేగం–-దూరం, వడ్డీ, సంభావ్యత, సంఖ్యా వ్యవస్థ, క్షేత్రమితి.
- రీజనింగ్, మిలిటరీ ఆప్టిట్యూడ్: అభ్యర్థుల తార్కిక ఆలోచనా శక్తిని అంచనా వేసేందుకు వర్బల్, నాన్- వర్బల్ రీజనింగ్ అంశాలను సిలబస్‌లో పొందుపరిచారు.
