- కేటీఆర్.. కాంగ్రెస్‌తో నీకున్న రహస్య ఒప్పందం బయటపెట్టు
- బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
నిర్మల్, వెలుగు : ‘మేం అష్టగ్రహాలం కాదు... మీరే దుష్టగ్రహాలు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై బీజేఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విరుచుకుపడ్డారు. గురువారం ఆయన తన క్యాంప్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. అధికారం కోల్పోయిన బాధతో కేటీఆర్ అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. లక్ష కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టి ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్‌తో కేటీఆర్‌కు ఉన్న రహస్య ఒప్పందం ఏమిటో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
నిర్మల్ పట్టణ అభివృద్ధి కోసం కేంద్రం అమృత్ 2.0 పథకం కింద రూ.100 కోట్లు కేటాయించిందని తెలిపారు. తాగునీటి సరఫరా కోసం రూ.62 కోట్లు, మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) నిర్మాణానికి రూ.42 కోట్లు మంజూరయ్యాయని వివరించారు. క్రిటికల్ కేర్ సెంటర్ నిర్మా ణానికి రూ.23.74 కోట్లు మంజూరయ్యాయన్నారు. బీఆర్ ఎస్ పదేండ్ల పాలన, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పనులు, కేంద్ర ప్రభుత్వం విధులతో గ్రామాల్లో జరుగుతున్న అభివృ ద్ధిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని, కేటీఆర్ రేవంత్‌రెడ్డితో కలిసి రావాలని సవాల్ విసిరారు.
