హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌కు చెందిన గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఎన్ఎస్ఈ సోషియల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ద్వారా రూ. కోటి నిధులు సమీకరించింది. ఈ నిధుల సేకరణ కోసం చేపట్టిన జీరో కూపన్ జీరో ప్రిన్సిపల్ ఇష్యూకు 100 శాతానికి మించి స్పందన లభించింది. ఈ నిధులతో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల్లో 10,000 మందికి క్యాన్సర్ పరీక్షలు నిర్వహించనున్నారు.
