దర్శకుడు వేణు ఊడుగుల సమర్పణలో రూపొందిన తాజా చిత్రం ‘చంద్రయాన్’. శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వంలో ప్రవీణ్ మొలక నిర్మించారు. శుక్రవారం సినిమా విడుదల సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. కొత్త టీమ్ రూపొందించిన వినూత్నమైన ఎంటర్‌టైనర్ ఇదని, కచ్చితంగా అందరికీ నచ్చుందని చీఫ్ గెస్ట్‌గా హాజరైన హీరో శ్రీవిష్ణు అన్నాడు.
మరో అతిథిగా హాజరైన కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు.. తెలంగాణ నేపథ్యంతో వస్తున్న సినిమాను తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. సమర్పకుడు వేణు ఊడుగుల మాట్లాడుతూ ‘కొత్త ఆలోచనతో, విభిన్నమైన కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఇలాంటి ప్రయత్నాలను ప్రేక్షకులు ఆదరించాలని కోరుతున్నా’ అని చెప్పారు.
దర్శకుడు శ్రీనాథ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ‘రెండున్నర గంటల పాటు నవ్వులు పంచే లాఫింగ్ థెరపీ లాంటి సినిమా ఇది’ అని చెప్పాడు. ఇదొక కంప్లీట్ ఎంటర్‌టైనర్ అని, ఆడియన్స్ హిలేరియస్‌గా ఎంజాయ్ చేస్తారని నటీనటులు అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.
