ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌ రీ యూనియన్ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌తో.. డోన్ బాస్కో మూవీ..

ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌ రీ యూనియన్ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌తో.. డోన్ బాస్కో మూవీ..

ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ బావమరిది రుష్య ద‌‌‌‌‌‌‌‌త్తా హీరోగా ప‌‌‌‌‌‌‌‌రిచ‌‌‌‌‌‌‌‌యం అవుతున్న చిత్రం ‘డాన్ బాస్కో’. గౌరీ శంకర్ దర్శకుడు. రాధా కృష్ణ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్స్ బ్యానర్స్‌‌‌‌‌‌‌‌పై వెంకట్ ఉప్పుటూరి నిర్మిస్తున్నారు. రాజ్‌‌‌‌‌‌‌‌కుమార్ కసిరెడ్డి, మిర్నా మీనన్, మౌనిక, మురళీ శర్మ, ప్రిన్సిపాల్ విశ్వనాథ్, రాజ్‌‌‌‌‌‌‌‌కుమార్ కసిరెడ్డి, కీలక పాత్రలు పోషించారు. బుధవారం ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. స్కూల్ ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌ రీ యూనియన్ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌తో ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనింగ్‌‌‌‌‌‌‌‌గా సాగిన టీజర్ ఆకట్టుకుంది. 

ఇక టీజర్ లాంచ్‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌కు ముఖ్య అతిథిగా హాజరైన వెంకీ అట్లూరి  మాట్లాడుతూ ‘టీజర్ ఎంతో వినోదాత్మకంగా ఉంది.  శంకర్ చక్కగా హ్యాండిల్ చేశారు. శ్రీచరణ్ బీజీఎం బాగుంది. మిర్నా ప్రతీ పాత్రకు ప్రాణం పోస్తుంటారు. రుష్య నాకు ఫ్యామిలీ మెంబర్. నేను సొంతంగా సినిమా నిర్మిస్తే ఎంత పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటానో ఇది అంత పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. హీరో రుష్య దత్తా మాట్లాడుతూ ‘మా బావ సూర్యదేవర నాగవంశీ గారికి థాంక్స్. 

మా అక్క, బావలే నాకు అమ్మనాన్నాలు. మిర్నా నా మొదటి హీరోయిన్. ఆమెతో వర్క్ చేయడం సంతోషంగా ఉంది. వెంకీ అట్లూరి గారి చేతుల మీదుగా టీజర్ లాంచ్ అవడం ఆనందంగా ఉంది’ అని అన్నారు. హీరోయిన్ మిర్నా, డైరెక్టర్ గౌరీ శంకర్, నిర్మాత నిర్మాత వెంకట్ ఉప్పుటూరి, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల తదితరులు పాల్గొన్నారు.