భద్రాద్రి జిల్లాలో మెడికల్ పోస్టులు.. ఇవాళే ( నవంబర్ 13 ) లాస్ట్ డేట్.. త్వరగా అప్లై చేసుకోండి..!

భద్రాద్రి జిల్లాలో మెడికల్ పోస్టులు.. ఇవాళే ( నవంబర్ 13 ) లాస్ట్ డేట్.. త్వరగా అప్లై చేసుకోండి..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ (డీఎం& హెచ్ఓ) పరిధిలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. 

మొత్తం పోస్టులు: 95.

విభాగాల వారీగా ఖాళీలు

ఎంఎల్​హెచ్​పీ/ సీహెచ్ఓ/ మెడికల్ ఆఫీసర్ (పల్లె దవాఖాన) 31, స్టాఫ్ నర్స్ 19, ల్యాబ్ టెక్నీషియన్  7, ఫార్మసిస్ట్ 3,  మెడికల్ ఆఫీసర్లు (ప్రత్యేకంగా కేటాయించినవి) 3, ఏఎన్ఎం/ సెకండ్ ఏఎన్ఎం 20, ఫార్మసిస్ట్ 3, ఓబీజీ స్పెషలిస్ట్ 2, క్లినికల్ సైకాలజిస్ట్/ కౌన్సెలర్ 1, సైకాలజిస్ట్ 1, వ్యాక్సిన్ అండ్ కోల్డ్ చైన్ మేనేజర్ 1, సోషల్ వర్కర్ 1, సీనియర్ డీఓటీఎస్, టీబీ – హెచ్ఐవీ సూపర్​వైజర్ 1, టీబీహెచ్​వీ 1. 

విద్యార్హతలు

  • స్టాఫ్ నర్స్ పోస్టులకు బీఎస్సీ/ జీఎన్ఎం నర్సింగ్, ఏఎన్‌ఎం పోస్టులకు ఎంపీహెచ్ డబ్ల్యూ (మహిళలు) కోర్సు, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు డీఎంఎల్​టీ, ఫార్మసిస్ట్ పోస్టులకు డి.ఫార్మసీ లేదా బి.ఫార్మసీ, మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఎంబీబీఎస్ లేదా బీఏఎంఎస్, కౌన్సిలర్ పోస్టులకు సైకాలజీ లేదా సోషల్ వర్క్​లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతోపాటు సంబంధిత కౌన్సిళ్లలో రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి
  • వయసు:18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయసు సడలింపు వర్తిస్తుంది
  • అప్లికేషన్: ఆఫ్​లైన్ ద్వారా.
  • లాస్ట్ డేట్:  నవంబర్ 13 (నేడే ఆఖరు).
  • సెలెక్షన్ ప్రాసెస్: అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సంబంధిత విద్యార్హత కోర్సులో సాధించిన అకడమిక్ మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు.
  • అనుభవం: ప్రభుత్వ ఆసుపత్రులు లేదా సంస్థల్లో కాంట్రాక్ట్/ అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేసిన అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వెయిటేజీ మార్కులు కేటాయిస్తారు.
  • మరిన్ని వివరాలకు వెబ్​సైట్ kothagudem.telangana.gov.in ను సందర్శించవచ్చు.

– వెలుగు, ఎడ్యుకేషన్