ఐరావత సినీ కలర్స్, అగ్‌మైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై రూపొందుతోన్న చిత్రం ‘పారడాక్స్ హరికథ’. అనుదీప్ రెడ్డి కొతూరు (ఏఆర్‌కే) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కిరణ్, రంజిత్, అఖిల రామ్, లావణ్య రెడ్డి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 11న విడుదల కానున్న ఈ చిత్రం నుంచి ‘గుప్పెడంత ప్రేమ’ అనే లవ్ సాంగ్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో టీమ్ మాట్లాడుతూ సినిమా వినూత్న కథాంశంతో రూపొందిందని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా విజయవంతం కావాలని అతిథులు, చిత్ర యూనిట్ కోరారు.
