నర్సాపూర్: డబుల్ బెడ్ రూమ్ లాటరీని అడ్డుకున్న కౌన్సిలర్లు

నర్సాపూర్: డబుల్ బెడ్ రూమ్ లాటరీని అడ్డుకున్న కౌన్సిలర్లు
  •     ప్రజల సమక్షంలోనే లాటరీ తీయాలని డిమాండ్ 

నర్సాపూర్, వెలుగు : లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ లను పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఆర్డీవో చేపట్టిన లాటరీని  గురువారం మెదక్​ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్లు, నాయకులు అడ్డుకున్నారు. నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్​ ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు మున్సిపాలిటీ కార్యాలయంలో ఆర్డీవో రామకృష్ణ  లాటరీ తీసేందుకు ప్రయత్నించారు. 

కాగా, లబ్ధిదారుల ఎంపిక కార్యాలయంలో కాకుండా ప్రజల సమక్షంలో పారదర్శకంగా నిర్వహించాలని కోరుతూ పలువురు కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు అడ్డుకున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చేశ్ యాదవ్, కౌన్సిలర్లు కండేల రాజు, సుధీర్ గౌడ్ తదితరులు ఆర్డీవో తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.