నర్సంపేట డిపో కండక్టర్ శంకర్ కొడుకుకు జాబ్: పొన్నం

  నర్సంపేట డిపో కండక్టర్ శంకర్ కొడుకుకు జాబ్: పొన్నం

హైదరాబాద్, వెలుగు: ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నామని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను  ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

గురువారం సెక్రటేరియెట్ లో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి సమ్మె సమయంలో సూసైడ్ ​చేసుకున్న నర్సంపేట డిపో కండక్టర్ శంకర్ గౌడ్ కొడుకుకు రికార్డు ట్రేసర్ గా నియామకపు ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం శంకర్ గౌడ్ కుటుంబానికి ఉద్యోగం ఇచ్చామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.