ప్రస్తుత ఇంటర్నెట్ ప్రపంచంలో గూగుల్, మైక్రోసాఫ్ట్ లేకపోతే కంపెనీల నుంచి సామాన్యుల వరకు ఎలాంటి కార్యకలాపాలు చేయలేని పరిస్థితి. అలాంటిది దాదాపు ఏడు గంటలకు పైగా మైక్రోసాఫ్ట్ పనిచేయకపోవడం టెక్ వరల్డ్ ను దాదాపు స్తంభింపజేసింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం (2026 నవంబర్ 12, 13) తెల్లవారుజాము వరకు సర్వర్లు భారీగా డౌన్ అయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది యూజర్లు ప్రభావితం అయ్యారు.
మైక్రోసాఫ్ట్ సేవలు Outlook, Microsoft Teams, Copilotతో పాటు Microsoft 365 సేవలు 7 గంటలకు పైగా పనిచేయకుండా పోయాయి. Downdetector ప్రకారం Outlook అవుటేజ్ రిపోర్టులు శుక్రవారం తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో గరిష్టంగా లక్షా38 వేల 58కి చేరుకున్నాయి. తర్వాత 4:30 గంటలకు సుమారు 34 వేల 490కి చేరుకున్నాయి. సర్వర్ల వైఫల్యం. మైక్రోసాఫ్ట్ మౌలిక సదుపాయాలలోని పలు సర్వర్లు ఆటోమేటెడ్ హెల్త్ చెక్‌లలో (automated health checks) విఫలమై అనుకోకుండా ఆగిపోయాయని కంపెనీ వెల్లడించింది.
అనుకోని సర్వర్ వైఫల్యాల వల్ల Outlook, Teams, Copilotతో పాటు ఇతర సేవలు డిస్రప్ట్ అయ్యాయి. సురక్షిత కనెక్షన్లు ఏర్పాటు చేసే ప్రాసెస్ లో భాగంగా.. ఓవర్ లోడ్ అయి సర్వర్లు రిక్వెస్టులను ప్రాసెస్ చేయలేకపోయాయని మైక్రోసాఫ్ట్ ఒక ప్రకటనలో తెలిపింది.ఈ సమస్య వల్ల 74 దేశాలలో లక్షలాది మంది వినియోగదారులు ఇమెయిల్స్ పంపడం, స్వీకరించడం, ఆన్‌లైన్ సేవలను ఉపయోగించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కంపెనీ సర్వర్లను రికవర్ చేసేందుకు ప్రయత్నిస్తూ, కాన్ఫిగరేషన్ మార్పులు చేస్తూ, కొన్ని ఏరియాల్లో తాత్కాలికంగా ట్రాఫిక్‌ను పరిమితం చేసిందని పేర్కొంది. సేవలు క్రమంగా రికవర్ అవుతున్నాయని, యూజర్లు మళ్లీ కనెక్ట్ అవుతున్నారని తెలిపింది.
ఏయే సేవలకు ఎఫెక్ట్:
ఎక్స్ చేంజ్ ఆన్ లైన్, ఔట్ లుక్ సేవలు: మెయిల్‌బాక్స్‌లు యాక్సెస్ చేయడంలో ఇబ్బంది కలిగింది. ఈమెయిల్ డెలివరీలో జాప్యం ఏర్పడింది.
మైక్రోసాఫ్ట్ కాపిలాట్ (Microsoft Copilot ): చాట్ లోడ్ కాకపోవడం సమస్యగా మారింది. ఈమెయిల్‌లు, క్యాలెండర్, ఫైల్స్ యాక్సెస్‌లో సమస్యలు తలెత్తాయి.
మైక్రోసాఫ్ట్ టీమ్స్ (Microsoft Teams): ప్రైమరీ మెసేజింగ్, మీటింగ్స్ సాధారణంగా పనిచేశాయి. కానీ క్యాలెండర్, మీటింగ్ షెడ్యూలింగ్ వంటి ఎక్స్ చేంజ్ ఆన్ లైన్ పై ఆధారపడిన ఫీచర్లు ప్రభావితమయ్యాయి.
ఇతర సర్వీసులు: షేర్ పాయింట్ ఆన్ లైన్(SharePoint Online), ప్లానర్ (Planner), టుడు(To Do),డిఫెండర్( Defender),పవర్ బిఐ ( Power BI), మైక్రోసాఫ్ట్ గ్రాఫ్ (Microsoft Graph) తదితర సర్వీసెస్ కూడా ప్రభావితం అయ్యాయి.
ఈ అవుటేజ్ వల్ల ఓపెన్ ఏఐ ( OpenAI), ఆంత్రోపిక్ ( Anthropic) వంటి కంపెనీల మైక్రోసాఫ్ట్ 365 కనెక్టర్లు కూడా ప్రభావితమయ్యాయి. ఓపెన్ ఏఐ కొత్త కనెక్షన్లు ఏర్పాటు కాకపోవడం, టూల్స్ పనిచేయకపోవడంపై విచారణ జరుపుతున్నారు.
మైక్రోసాఫ్ట్ సర్వర్లు డౌన్ కావడంతో కొన్ని వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయి. ఎలక్ట్రిక్ ట్రక్ తయారీ కంపెనీ వర్క్ హార్స్ గ్రూప్ థర్డ్ క్వార్టర్ ఫలితాల ప్రకటనను నవంబర్ 12 నుంచి 16కి వాయిదా వేసింది. మైక్రోసాఫ్ట్ ఇటీవలే అజూర్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌లో కూడా అవుటేజ్‌ను ఎదుర్కొంది. ప్రస్తుతం సేవలు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని కంపెనీ తెలిపింది. యూజర్లు మైక్రోసాఫ్ట్ సర్వీస్ స్టేటస్ పేజీని చూసి అప్‌డేట్‌లను తెలుసుకోవాలని సూచిస్తున్నారు.
