- రికార్డ్ డేట్ నవంబర్ 25
న్యూఢిల్లీ: జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ తన వాటాదారులకు శుభవార్త అందించింది. రూ.600 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్‌కు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా గరిష్ఠంగా 6.59 కోట్ల ఈక్విటీ షేర్లను ఒక్కోటి రూ.91 చొప్పున చెల్లించి తిరిగి కొనుగోలు చేయనుంది. గురువారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు రూ.73.50 వద్ద ముగిసింది. ఈ ధరతో పోలిస్తే బైబ్యాక్ ధర 23.8 శాతం అధికం. ఈ ఆఫర్‌లో పాల్గొనే అర్హతను నిర్ణయించేందుకు నవంబర్ 25ను రికార్డు తేదీగా ప్రకటించింది. టెండర్ ఆఫర్ విధానంలో ఈ ప్రక్రియ చేపట్టనుంది.
ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సభ్యులు బైబ్యాక్‌లో పాల్గొనబోమని కంపెనీకి తెలిపారు. ప్రస్తుత మార్కెట్ విలువతో పోలిస్తే కంపెనీ అంతర్గత విలువకు తగిన గుర్తింపు ల భించడం లేదని, వాటాదారులకు దీర్ఘకాలిక విలువను అందించడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశమని సంస్థ వెల్లడించింది. గురువారం కంపెనీ షేరు 3.7 శాతం లాభపడింది.
