ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ (ఐఐటీ, హైదరాబాద్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 10 నుంచి ప్రారంభం కాగా, దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 1 చివరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 8.
విభాగాల వారీగా ఖాళీలు: ఏవీ టెక్నీషియన్ 1, హెచ్‌పీసీ సిస్టమ్ ఇంజినీర్ 2, నెట్‌వర్క్ ఇంజినీర్ 3, వెబ్ డెవలపర్ 1, సిస్టమ్ ఇంజినీర్ 1.
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ (బీఈ/ బి.టెక్/ బీఎస్సీ) లేదా మాస్టర్స్ డిగ్రీ (ఎంఈ/ ఎం.టెక్/ ఎంసీఏ) పూర్తిచేసి ఉండాలి.
కొన్ని పోస్టులకు పని అనుభవం తప్పనిసరి.
వయసు: 2026, డిసెంబర్ 1 నాటికి హెచ్‌పీసీ సిస్టమ్ ఇంజినీర్ పోస్టులకు గరిష్ట వయోపరిమితి 40 ఏళ్లు.
మిగతా పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 10.
లాస్ట్ డేట్: డిసెంబర్ 11.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.iith.ac.inను సందర్శించండి.
- వెలుగు, ఎడ్యుకేషన్
