పిల్లలు స్కూల్ నుంచి వచ్చే సరికి రక్తపు మడుగులో తల్లి.. హైదరాబాద్ మీర్పేట్లో దారుణ ఘటన

పిల్లలు స్కూల్ నుంచి వచ్చే సరికి రక్తపు మడుగులో తల్లి.. హైదరాబాద్  మీర్పేట్లో దారుణ ఘటన

హైదరాబాద్‌ మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడ దత్తునగర్‌లో మహిళ దారుణ హత్యకు గురైంది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన అరుణ్ కుమార్, ఆయన భార్య అనిత (35) తమ కుటుంబంతో కలిసి దత్తు నగర్‌లో నివసిస్తున్నారు.  శ్రీ లక్ష్మీ రెసిడెన్సీ బ్లాక్-Aలో మూడో అంతస్తులో గత నాలుగు సంవత్సరాలుగా అద్దెకు  ఉంటున్నారు. అరుణ్ కుమార్  మిదాని (కేంద్ర ప్రభుత్వ) ఉద్యోగిగా పనిచేస్తున్నారు.

అయితే బుధవారం (2026 నవంబర్ 11)న స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలు తల్లి అనిత రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించి వెంటనే తండ్రి అరుణ్ కుమార్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది.
 
సమాచారం అందుకున్న మీర్‌పేట్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి మహిళ హత్యకు గల కారణాలు, నిందితుల కొరకు గాలింపు చర్యలు చేపట్టారు.