నితిన్ హీరోగా ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అలియాస్ రుక్మిణీ’. హీరో నాని సమర్పణలో దీప్తి గంటా నిర్మిస్తున్నారు. ఆఫియా సయ్యద్ హీరోయిన్గా నటిస్తోంది. శుక్రవారం ‘పిచ్చి ప్రేమలో’ అనే పల్లవితో సాగే రెండో పాటను రిలీజ్ చేశారు. విజయ్ బుల్గానిన్ కంపోజ్ చేసిన పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ రాయగా, కార్తీక్ పాడాడు.
‘చిరు చిరు చిలకవే.. చిన్నెలున్న అలకవే.. చిత్రమైన మనసువే వయ్యారి.. అరకొర పొగరువే.. అందమైన సగమువే.. అల్లుకున్న సొగసువే నా దేవి..’ అంటూ సాగిన పాటలో తన భార్య అందంగా ఉండటమే కాకుండా, అల్లరి చేసే స్వభావం, అప్పుడప్పుడు మారాం చేయడం, చిన్న చిన్న విషయాలకు అలగడం తనకు మరింత ప్రత్యేకంగా అనిపిస్తుందని హీరో చెప్పడం ఆకట్టుకుంటుంది. ఈ పాటకు ఈశ్వర్ పెంటి అందించిన కొరియోగ్రఫీ నేచురల్‌గా ఉంది.
మిడిల్ క్లాస్ భర్త పాత్రలో నితిన్ సహజంగా కనిపించగా, సంప్రదాయ దుస్తుల్లో ఆఫియా సయ్యద్ అందంగా కనిపిస్తుంది. వీరిమధ్య కెమిస్ట్రీ పాటకు మరింత ఆకర్షణ తీసుకొచ్చింది. సాయి కుమార్, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 4న వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది.
