హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ భూముల ప్రీ-బిడ్ సమావేశ తేదీ మార్పు

హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ భూముల ప్రీ-బిడ్ సమావేశ తేదీ మార్పు

హైదరాబాద్ సిటీ, వెలుగు: హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో భూముల ఈ- వేలానికి సంబంధించి నిర్వహించాల్సిన ప్రీ-బిడ్ సమావేశం తేదీని అధికారులు మార్చారు. ముందుగా ఈనెల18న నిర్వహించాల్సిన సమావేశాన్ని పలు కారణాలతో ఈ నెల 17న నిర్వహించాలని నిర్ణయించారు.

హకీంపేటలోని హుడా హైట్స్ లేఅవుట్, కోకాపేటలోని నియోపోలిస్ లేఅవుట్ ప్లాట్ నంబర్ 17, మూసాపేటలోని భూములకు సంబంధించిన ప్రీ-బిడ్ సమావేశానికి ఈ మార్పు వర్తిస్తుందని తెలిపారు. ఈ-వేలం తేదీలు, రిజిస్ట్రేషన్ చివరి తేదీ, ఈఎండీ చెల్లింపులు సహా ఇతర నిబంధనల్లో ఎలాంటి మార్పు లేదని హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ స్పష్టం చేసింది.

కాగా, ఇన్ముల్‌‌‌‌‌‌‌‌నర్వ లేఅవుట్‌‌‌‌‌‌‌‌లో 45 నివాస ప్లాట్ల ఈ -వేలానికి సంబంధించి శుక్రవారం నిర్వహించిన ప్రీ-బిడ్ సమావేశానికి కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన వచ్చిందని అధికారులు తెలిపారు.   కాగా,  ఈ ప్లాట్ల ఈ -వేలం ఈ నెల 23న నిర్వహించనున్నారు. వేలంలో పాల్గొనాలనుకునే వారు 21వ తేదీలోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని కోరారు.  మరిన్ని వివరాల కోంస 7416835522 నంబర్‌‌‌‌‌‌‌‌లో సంప్రదించాలన్నారు.