హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హఫీజ్‌పేట్ ఫ్లైఓవర్ పక్కనే ఉన్న ఓ పెయింటింగ్ షాపులో శనివారం(నవంబర్ 14) తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు పరుగులు పెట్టారు. సమాచారం అందుకన్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే షాపులోని సామగ్రి మంటల్లో పూర్తిగా కాలిపోయింది.
ఈ ప్రమాదంలో రూ. 60 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనావేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
