హైదరాబాద్, వెలుగు: ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన 300 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఎడ్యుబ్రిడ్జ్ సంస్థ హైదరాబాద్‌లో డిజిటల్ అకాడమీని ప్రారంభించింది. సింక్రోనీ, క్యాప్‌జెమినీ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఐటీ, ఐటీఈఎస్, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, ఫిన్‌టెక్ రంగాల్లో ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను నేర్పించనున్నారు.
ప్రతి ఒక్కరికీ 200 గంటలకు పైగా శిక్షణ ఇస్తారు. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు ఉద్యోగంలో అవసరమైన నైపుణ్యాలు, ఇంటర్వ్యూలకు సిద్ధమయ్యే విధానం నేర్పిస్తారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారిలో కనీసం 70 శాతం మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. శిక్షణ పురోగతిని తెలుసుకోవడానికి ఆన్లైన్ పోర్టల్ అందుబాటులో ఉంటుంది. సింక్రోనీ, క్యాప్‌జెమినీ నిపుణులు వీరికి సహకారం అందిస్తారు. కోర్సు పూర్తిచేసిన వారికి జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ సర్టిఫికెట్లు అందజేస్తుంది.
