నవంబర్15న రక్షణ రంగంలో.. టెక్నాజీలపై సదస్సు

నవంబర్15న రక్షణ రంగంలో.. టెక్నాజీలపై  సదస్సు
  • చీఫ్​ గెస్టుగా మంత్రి రాజ్​నాథ్​

హైదరాబాద్​, వెలుగు: రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో ఆధునిక టెక్నాలజీలపై చర్చించేందుకు హైదరాబాద్ వేదిక కానుంది. ఇండియన్  సొసైటీ ఫర్ నాన్‌‌‌‌‌‌‌‌ డిస్ట్రక్టివ్‌‌‌‌‌‌‌‌ టెస్టింగ్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో ఎన్‌‌‌‌‌‌‌‌డీఈ, ఏరోఎన్‌‌‌‌‌‌‌‌డీటీ సదస్సులు ఈనెల 15–17 మధ్య హైటెక్స్​లో జరగనున్నాయి.  

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్ వీటిని ప్రారంభించనున్నారు. వందకు పైగా సంస్థలు ప్రదర్శనల్లో పాల్గొననుండగా, 2,000 మందికి పైగా నిపుణులు, శాస్త్రవేత్తలు వస్తారు. బ్రహ్మోస్ క్షిపణుల ఎగుమతులపై ఆగ్నేయాసియాలోని మరికొన్ని దేశాలతో చర్చలు తుది దశకు చేరుకున్నాయని బ్రహ్మోస్ ఏరోస్పేస్ సీఈఓ జోషి వెల్లడించారు.

మరిన్ని వార్తలు