హైదరాబాద్ పార్కులు, చెరువు భూములను కాపాడిన హైడ్రా

హైదరాబాద్ పార్కులు, చెరువు భూములను కాపాడిన హైడ్రా

హైదరాబాద్ సిటీ/ఘట్​కేసర్, వెలుగు: హైదరాబాద్ నగరంలోని మూడుచోట్ల హైడ్రా శుక్రవారం ప్రభుత్వ భూములను కాపాడింది. ఆక్రమణలు తొలగించిన ప్రాంతాల్లో ఫెన్సింగ్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేసి హైడ్రా హెచ్చరిక బోర్డులను నెలకొల్పింది. మేడ్చల్‌‌‌‌‌‌‌‌–మల్కాజిగిరి జిల్లా ఘట్‌‌‌‌‌‌‌‌కేసర్‌‌‌‌‌‌‌‌ మండలం అన్నోజిగూడలో సర్వే నంబర్లు 94, 95లోని 3,400 చదరపు గజాల స్థలాన్ని కాపాడింది. ఇందులో పార్కుకు 1,122 గజాలు, పాఠశాలకు 1,018, కమ్యూనిటీ హాలుకు 742, ఆలయం కోసం  518 గజాలు కేటాయించినట్లు రికార్డుల ద్వారా గుర్తించింది.

రంగారెడ్డి జిల్లా హయత్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ మండలం విజయనగర్‌‌‌‌‌‌‌‌ కాలనీ ఫేజ్‌‌‌‌‌‌‌‌-2లో 447 చదరపు గజాల పార్కు స్థలాన్ని పరిరక్షించింది. 1999లో ఏర్పాటైన లేఅవుట్‌‌‌‌‌‌‌‌లో పార్కుకు ఈ స్థలం కేటాయించినట్లు రికార్డుల్లో నిర్ధారించింది. బాలాపూర్‌‌‌‌‌‌‌‌ మండలంలోని 7.20 ఎకరాల కొత్తమోనికుంట చెరువు ఎఫ్‌‌‌‌‌‌‌‌టీఎల్‌‌‌‌‌‌‌‌ పరిధిలో ఆక్రమణలు గుర్తించింది. ఎకరానికి పైగా స్థలంలో నిర్మించిన ప్రీకాస్ట్‌‌‌‌‌‌‌‌ ప్రహరీలను తొలగించి, చెరువు చుట్టూ ఫెన్సింగ్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేసింది. మట్టి పోసి చెరువును పూడ్చే ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసింది.