ఆకట్టుకున్న ‘ది సర్ గేమ్ వైకుంఠపాళి’.. సర్ ప్రక్రియతో దేశంలో 13.39 కోట్ల ఓట్ల గల్లంతు

ఆకట్టుకున్న ‘ది సర్ గేమ్ వైకుంఠపాళి’.. సర్ ప్రక్రియతో దేశంలో 13.39 కోట్ల ఓట్ల గల్లంతు
  • ఆకట్టుకున్న ‘ది సర్​ గేమ్​ వైకుంఠపాళి’..
  • సర్ ప్రక్రియతో దేశంలో 13.39 కోట్ల ఓట్ల గల్లంతు.. తెలంగాణలోనే 73 లక్షలు
  • భారత్ సమిట్లో ఓట్ల తొలగింపుపై ఎగ్జిబిషన్

హైదరాబాద్, వెలుగు: దేశంలో సర్ పేరుతో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితాల సవరణలో ఏకంగా 13.39 కోట్ల ఓట్లు గల్లంతయ్యాయని, ప్రతి ఏడుగురిలో ఒకరి ఓటు రద్దయిందని ప్రజా సంఘాలు, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు తెలిపారు. హైదరాబాద్​ వేదికగా శుక్రవారం భారత్ సమిట్ రెండో ఎడిషన్‌‌‌‌ ప్రారంభమైంది. ఇందులో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్​లో ఈ అంశాలను ప్రస్తావించారు.

దేశవ్యాప్తంగా 100 మంది వయోజనుల్లో 12 మందికి అసలు ఓటు హక్కే లేకుండా పోయిందని ప్రముఖ ఆర్థికవేత్త జాన్ డ్రేజ్, యోగేంద్ర యాదవ్ పరిశోధన పత్రాలు స్పష్టం చేశాయి. తెలంగాణలోనే ముసాయిదా జాబితా నాటికి ఏకంగా 21.7 శాతం మేర ఓట్లు తగ్గిపోయాయని, సుమారు 73 లక్షల మంది ఓట్లను తొలగించారన్నారు.

ఈ సందర్భంగా  ఏర్పాటు చేసిన ది సర్​ గేమ్  వైకుంఠపాళి ఫ్లోర్ బోర్డు విశేషంగా ఆకట్టుకుంది. ఓటరు గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న పౌరుడిని అధికారులు ఫారాలు అందలేదని, అడ్రస్ లేదని, వివాహ వలసల పేరిట పాము మింగినట్లు ఎలా జాబితా నుంచి తప్పిస్తున్నారో కళ్లకు కట్టేలా ప్రదర్శించారు.

కర్నాటకలో 99.32 లక్షలు(-17.9%), ఉత్తరప్రదేశ్‌‌‌‌లో 2.04 కోట్లు(-13.2%), పశ్చిమ బెంగాల్‌‌‌‌లో 1.22 కోట్లు (-15.9%), బిహార్‌‌‌‌లో 48 లక్షలు(-6.1%), ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లో 25 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. పేర్ల ఆధారంగా మతాల వారీగా జరిగిన పరిశీలనల్లో పక్షపాతం స్పష్టంగా కనిపించిందని నివేదికలు తెలిపాయి.