అల్ అమెరాత్: అండర్–19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ కు ఇండియా, పాకిస్తాన్ రెడీ అయ్యాయి. శనివారం జరిగే మెగా పోరులో గెలిచి రికార్డు స్థాయిలో తొమ్మిదో టైటిల్‌ను సొంతం చేసుకోవాలని యంగ్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. అదే టైమ్‌లో గతేడాది ఫైనల్లో పాక్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని కూడా భావిస్తోంది. బ్యాటింగ్‌లో ఆర్యవీర్ సెహ్వాగ్ ఆడిన 4 మ్యాచ్‌ల్లో 303 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు.
కెప్టెన్ లక్ష్య రాయ్‌చందానీ, అన్వయ్ ద్రవిడ్, అర్జున్ రాజ్‌పుత్‌లాంటి బ్యాటర్ల నుంచి మరింత మెరుగైన ప్రదర్శన రావాల్సి ఉంది. బౌలింగ్‌లో పేసర్ ఇషాన్ సూద్ 4 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీశాడు. అయితే స్పిన్నర్లు రాజ్‌పుత్, మనాల్ చౌహాన్ నుంచి సూద్‌కు సహకారం లభించాల్సి ఉంది. మరోవైపు పాకిస్తాన్ తరఫున ఉస్మాన్ ఖాన్ (238 రన్స్), పేసర్ రిజ్వానుల్లా (11 వికెట్లు) మంచి ఫామ్‌లో ఉన్నారు.
