న్యూఢిల్లీ: ఇండియా విమెన్స్ జట్టు ఆల్‌రౌండర్ దీప్తి శర్మ.. అక్టోబర్ నెలకు గాను ‘ఐసీసీ విమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డును గెలుచుకుంది. 29 ఏళ్ల దీప్తి శర్మ తన కెరీర్‌లో ఈ పురస్కారాన్ని రెండోసారి సొంతం చేసుకుంది. జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 49 పరుగులు చేసి టీమ్‌ను గెలిపించింది.
రెండో వన్డేలో సెంచరీతో పాటు 3 వికెట్లు పడగొట్టింది. మొత్తంగా జింబాబ్వేతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లలో 155 పరుగులు చేసి, 7 వికెట్లు పడగొట్టి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించింది. సౌతాఫ్రికా ఆల్ రౌండర్ మార్కో యాన్సెన్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మంత్' అవార్డు దక్కింది.
