- ఈ 1, ఈ 2, డి హాస్టళ్లకు కరెంటు, వాటర్ సప్లై ఇవ్వాలి
- అడ్మినిస్ట్రేటివ్బిల్డింగ్దగ్గర విద్యార్థులు ధర్నా
ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీలోని ఈ1, ఈ2, డి హాస్టళ్లకు విద్యుత్, నీటి సరఫరాను వెంటనే పునరుద్ధరించి హాస్టల్స్ కూల్చివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం విద్యార్థులు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదుట ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా విద్యార్థి నేతలు జంగయ్య, నరేష్, నాగరాజు, భీమారావు, సురేష్, కార్తీక్, హరీష్ మాట్లాడుతూ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కనీస వసతులు కల్పించకుండా హాస్టల్స్లో ఉన్న వారిని ఖాళీ చేయించి కరెంట్, నీళ్లు కట్ చేయడం దారుణమన్నారు.
ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.1,000 కోట్ల నిధులను విడుదల చేసి, నూతన హాస్టళ్లు, ఆధునిక ల్యాబ్‌లు, మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. తర్వాత ఆందోళన చేస్తున విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి నల్లకుంట పీఎస్కు తరలించారు.
కాగా, హాస్టల్స్ భవనాలు 80 ఏండ్ల కిందివి కావడంతో శిథిలావస్థకు చేరుకున్నాయని, అందుకే వాటిని కూల్చేందుకు విద్యార్థులను ఇతర హాస్టల్స్కు తరలించామని వర్సిటీ అధికారులు చెప్తున్నారు. అందులో భాగంగానే కరెంట్, నీటి సరఫరాను ఆపేశామన్నారు.
