ORS అనుకుని ఎలుకల మందు తాగింది.. ఏదులాబాద్‌‌‌‌‌‌‌‌లో వృద్ధురాలు మృతి

ORS అనుకుని ఎలుకల మందు తాగింది.. ఏదులాబాద్‌‌‌‌‌‌‌‌లో వృద్ధురాలు మృతి

ఘట్‌‌‌‌‌‌‌‌కేసర్, వెలుగు: ఘట్‌‌‌‌‌‌‌‌కేసర్‌‌‌‌‌‌‌‌ పీఎస్​పరిధిలోని ఏదులాబాద్‌‌‌‌‌‌‌‌లో చిన్నపాటి పొరపాటు ఓ వృద్ధురాలి ప్రాణాలు తీసింది. ఓఆర్​ఎస్​ అనుకుని ఎలుకల మందు తాగడంతో చికిత్స పొందుతూ కన్ను మూసింది. ఏదులాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన తోటకూర రాములమ్మ (73) కొంతకాలంగా మధుమేహంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది.

బుధవారం రాత్రి నుంచి తీవ్ర నీరసానికి గురైన ఆమె గురువారం ఓఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్యాకెట్‌‌‌‌‌‌‌‌గా భావించి పొరపాటున ఎలుకల మందు నీళ్లలో కలుపుకుని తాగింది. కొద్దిసేపటికే అస్వస్థతకు గురికావడంతో దగ్గరల్లోని ఆర్‌‌‌‌‌‌‌‌ఎంపీ దగ్గరకు..ఆయన సూచన మేరకు ఘట్‌‌‌‌‌‌‌‌కేసర్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ కన్నుమూసింది.