పెర్త్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా బోణీ చేసింది. బౌలింగ్‌లో మహ్లీ బేర్డ్మన్ (6/24), బ్యాటింగ్‌లో మిచెల్ మార్ష్ (50) రాణించడంతో.. శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఆసీస్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. దాంతో సిరీస్‌లో కంగారూలు 1–0 ఆధిక్యంలో నిలిచారు.
టాస్ ఓడిన ఇంగ్లండ్ 33.4 ఓవర్లలో 131 రన్స్‌కే ఆలౌటైంది. గస్ అట్కిన్సన్ (29 నాటౌట్) టాప్ స్కోరర్. టామ్ బాంటమ్ (25), విల్ జాక్స్ (25) మినహా మిగతా అందరూ ఫెయిలయ్యారు. స్పెన్సర్ జాన్సన్ 3 వికెట్లు తీశాడు. తర్వాత ఆసీస్ 23.3 ఓవర్లలో 132/3 స్కోరు చేసి నెగ్గింది.
కూపర్ కనోలీ (27), జోస్ ఇంగ్లిస్ (23 నాటౌట్), మ్యాట్ రెన్షా (26 నాటౌట్) రాణించారు. బేర్డ్మన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే ఆదివారం అడిలైడ్‌లో జరుగుతుంది.
