రావల్పిండి: బ్యాటింగ్‌లో సౌద్ షకీల్ (97) రాణించడంతో.. శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్‌ను పాకిస్తాన్ డ్రా చేసుకుంది. దాంతో రెండు మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 0–0తో సమంగా ఉంది. 57/1 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం ఐదో రోజు ఆట కొనసాగించిన పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 84.5 ఓవర్లలో 284/8 స్కోరు చేసింది. గాజి ఘోరీ (35), బాబర్ ఆజమ్ (34), మహ్మద్ తాహా (24), అజాన్ అవైస్ (22) మోస్తరుగా ఆడారు.
తయ్యబ్ ఆరిఫ్ (11), సల్మాన్ ఆగా (13) నిరాశపర్చారు. మిలాన్ రత్నాయకే 3, అసితా ఫెర్నాండో, లాహిరు కుమార చెరో రెండు వికెట్లు తీశారు. అంతకుముందు లంక తొలి ఇన్నింగ్స్‌లో 117.2 ఓవర్లలో 446 రన్స్‌కు ఆలౌటైంది. 7 వికెట్లు తీసిన సాకిబ్ ఖాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్ట్ మంగళవారం నుంచి ఇదే వేదికపై జరుగుతుంది.
