Dada Dhamaka: ఎక్కడ చూసినా బాలయ్య పాటే.. ట్రెండింగ్‌లో ‘దాదా ధమాకా’!

Dada Dhamaka: ఎక్కడ చూసినా బాలయ్య పాటే.. ట్రెండింగ్‌లో ‘దాదా ధమాకా’!

బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని రూపొందిస్తున్న  చిత్రం ‘దాదా’. వృద్ధి  సినిమాస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వెంకట సతీష్​ కిలారు నిర్మిస్తున్నారు.  శుక్రవారం ఈ సినిమా నుంచి ‘దాదా ధమాకా’ పేరుతో ఫస్ట్ సాంగ్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. తమన్ కంపోజ్ చేసిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి క్యాచీ లిరిక్స్ రాశారు. రజిని శ్రీ పూర్ణిమతో కలిసి బాలకృష్ణ వాయిస్ షేర్ చేసుకోవడం ఈ పాటకు ప్రత్యేకతగా నిలుస్తుంది. మాస్ బీట్, ఆకట్టుకునే లిరిక్స్, బాలయ్య ఎనర్జీతో ఈ పాటకు మంచి స్పందన లభిస్తోంది. తమన్ మరోసారి తనదైన సంగీతంతో అభిమానులను అలరించే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ బాలయ్య ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. 

‘షెహరంత అదిరిపోనీ.. నిదరంతా చెదిరిపోనీ.. జామురాతిరి  జాగరం చేయనివ్వరు  పరువాణ్ని.. నువ్వు గమ్మునుంటే నచ్చలే నచ్చలే.. ఆట పాట తాట తీద్దాం.. వద్దు అంటే ఒప్పుకోను అస్సలే.. హే బావలే బావలే బావలే.. ఇక్కడున్నోళ్లంతా నాకు సొంత బావలే..’ అంటూ పబ్ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో బాలకృష్ణ, బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ కలిసి కనిపించిన ఈ పాట ఫుల్ ఎనర్జీతో సాగుతూ ఆకట్టుకుంటోంది. చేతిలో గన్,  లెదర్ జాకెట్, సన్‌‌‌‌‌‌‌‌గ్లాసెస్‌‌‌‌‌‌‌‌తో బాలయ్య  స్టైలిష్‌‌‌‌‌‌‌‌గా ఇంప్రెస్ చేస్తున్నారు.

ఈ చిత్రంలో మంచు మనోజ్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అరవింద్ ఎస్. కశ్యప్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్  నిర్వహిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్  రాశారు. రామ్-లక్ష్మణ్, రవివర్మ, వి. వెంకట్ యాక్షన్ సీక్వెన్స్‌‌‌‌‌‌‌‌లను కంపోజ్ చేస్తున్నారు. క్రిస్మస్ కానుకగా  డిసెంబర్ 24న వరల్డ్‌‌‌‌‌‌‌‌వైడ్‌‌‌‌‌‌‌‌గా సినిమాను విడుదల చేయనున్నారు. ‘వీర సింహారెడ్డి’ తర్వాత బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి.