ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
- మొత్తం ఖాళీలు: 8.
- విద్యార్హతలు: ఎంబీబీఎస్, బయోమెడికల్ సైన్సెస్లో మాస్టర్స్ డిగ్రీ, ఫార్మ్–డి లేదా వీసీఐ గుర్తింపు పొందిన బీవీఎస్సీ & ఏహెచ్ డిగ్రీని కలిగి ఉండాలి. దీంతోపాటు సైంటిస్ట్–డి పోస్టులకు 8 సంవత్సరాలు, సైంటిస్ట్–సి పోస్టులకు నాలుగేళ్ల అనుభవం తప్పనిసరి. కాగా పీహెచ్డీ/ పీజీ చేసిన వారికి నిర్దిష్ట అనుభవం వర్తిస్తుంది. సైంటిస్ట్-–బి పోస్టులకు అనుభవంతోపాటు సంబంధిత డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది.
- లాస్ట్ డేట్: డిసెంబర్ 6.
- సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- మరిన్ని వివరాలకు వెబ్సైట్recruitment.icmr.org.inను సందర్శించండి.
– వెలుగు, ఎడ్యుకేషన్
