ఈ వారం ప్రారంభం నుంచి భారీగా పతనం అయిన బంగారం రేట్లు మళ్లీ వారాంతంలో పుంజుకున్నాయి. కార్తీకమాసంలో పెళ్లిళ్ల కోసం ఆభరణాలు షాపింగ్ చేస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ నగరంలో మారిన గోల్డ్ రేట్లను ముందుగా పరిశీలించటం మంచిది.
నవంబర్ 14న బంగారం రేట్లు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు 27 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.13వేల 762గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.12వేల 615గా కొనసాగుతోంది.
శనివారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. నవంబర్ 14, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కూడా స్వచ్ఛమైన వెండి కేజీకి రూ.లక్షా 95వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.195 దగ్గర ఉంది. భవిష్యత్తులో రేట్లు ఇంకా తగ్గొచ్చని అంచనా.
