గుజరాత్ టైటాన్స్‌లోకి హర్షల్ పటేల్.. రూ.4 కోట్లకే సన్‌రైజర్స్తో ఒప్పందం!

గుజరాత్ టైటాన్స్‌లోకి హర్షల్ పటేల్.. రూ.4 కోట్లకే సన్‌రైజర్స్తో ఒప్పందం!

Harshal Patel: ఐపీఎల్ 2027 (IPL 2027) మినీ వేలానికి ముందు ట్రేడ్ విండోలో మరో ఆసక్తికర డీల్ కుదిరింది. రెండుసార్లు పర్పుల్ క్యాప్ విజేత, పేసర్ హర్షల్ పటేల్ (Harshal Patel) సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టును వీడి గుజరాత్ టైటాన్స్ (GT) గూటికి చేరబోతున్నాడు. ఈ మేరకు ఇరు ఫ్రాంచైజీల మధ్య రూ. 4 కోట్ల ఆల్-క్యాష్ డీల్ (All-Cash Deal) కుదిరినట్లు తెలుస్తుంది. 2025 మెగా వేలంలో రూ. 8 కోట్లకు హర్షల్‌ను కొనుగోలు చేసిన SRH, ఇప్పుడు సగం ధరకే అతడిని గుజరాత్‌కు అప్పగించబోతున్నట్లు సమాచారం. 

హర్షల్ పటేల్‌ను సన్‌రైజర్స్ ఎందుకు ట్రేడ్ చేస్తుందంటే:

* 2026లో ఘెరంగా విఫలం: 2025 సీజన్‌లో SRH తరఫున 13 మ్యాచ్‌లు ఆడి 16 వికెట్లు తీసిన హర్షల్ పటేల్.. గత సీజన్‌లో (IPL 2026) ఘోరంగా విఫలమయ్యాడు. ఏకంగా 5 మ్యాచ్‌లు ఆడి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.

* కొత్త బౌలర్ల రాక: ఈ నెలలో 36వ ఏట అడుగుపెట్టనున్న హర్షల్ స్థానంలో సన్‌రైజర్స్ ఇప్పటికే ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్‌లను ప్రోత్సహిస్తోంది. అంతేకాకుండా ఖలీల్ అహ్మద్, టి. నటరాజన్‌లను జట్టులోకి తీసుకోవడంతో హర్షల్‌ను వదిలించుకోవాలని SRH ఫిక్స్ అయింది. 

గుజరాత్ పేస్ దళానికి మరింత బలం: 

* ఈ ట్రేడ్ డీల్ పూర్తయితే గుజరాత్ టైటాన్స్ వేలం పర్స్ నుంచి రూ. 4 కోట్లు తగ్గుతాయి. అహ్మదాబాద్‌కు చెందిన హర్షల్ పటేల్, దేశవాళీ క్రికెట్‌లో గుజరాత్ తరఫునే ఆడతాడు. ఇప్పుడు ఐపీఎల్‌లోనూ సొంత రాష్ట్రం తరఫున ఆడే అరుదైన అవకాశం అతడికి దక్కింది.

►ALSO READ | ఇంతకీ ఇది టెస్టా? టీ20నా?.. బాయ్స్, గర్ల్స్ కలిసి ఆడే సరికొత్త గేమ్.. రూల్స్ చూస్తే మైండ్ బ్లాకే!

* భీకరమైన GT పేస్ అటాక్: గుజరాత్ టైటిన్స్ జట్టులో ఇప్పటికే కగిసో రబాడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, జేసన్ హోల్డర్ లాంటి స్టార్ పేసర్లు ఉన్నారు. ఇప్పుడు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ హర్షల్ కూడా తోడవడంతో గుజరాత్ బౌలింగ్ విభాగం మరింత స్ట్రాంగ్ అవుతుంది. 

* 5వ ఫ్రాంచైజీ: 2012లో ఐపీఎల్ లోకి అరంగేట్రం చేసిన హర్షల్ పటేల్.. ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఢిల్లీ క్యాపిటల్స్ (DC), పంజాబ్ కింగ్స్ (PBKS), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లకు ఆడాడు. గుజరాత్ టైటాన్స్ అతడికి ఐదో ఫ్రాంచైజీ కానుంది.