కార్తీకమాసం:కార్తీక దీపాల ప్రమిదలో ఎన్నివత్తులు వెలిగించాలి.. ఇంటి గుమ్మం దగ్గర దీపారాధన నియమాలు ఇవే..!

కార్తీకమాసం:కార్తీక దీపాల ప్రమిదలో ఎన్నివత్తులు వెలిగించాలి.. ఇంటి గుమ్మం దగ్గర దీపారాధన నియమాలు ఇవే..!

కార్తీకమాసం ప్రారంభమై ( నవంబర్​ 14 నాటికి) ఐదు రోజులైంది.  ఈ నెలలో దీపారాధనకు చాలా విశిష్టత ఉందని పండితులు చెబుతున్నారు.  ఇంట్లో తులసి కోటల దగ్గర ఉదయం.. సాయంత్రం రెండు పూటలా దీపారాధన చేస్తారు.  అవకాశం ఉన్న శివాలయాలకు వెళ్లి దీపాలు వెలిగిస్తారు.  అయితే ఇంటి  ప్రధాన ద్వారం దగ్గర  రెండువైపులా ఈ దీపాన్ని వెలిగించడం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.   అయితే ఇంటి గుమ్మం దగ్గర దీపం ఎలా పెట్టాలి? ఏ దిశలో పెట్టాలి? ఎటువంటి ప్రమిదలను ఉపయోగించాలి?ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . .! 


పురాణాల ప్రకారం ప్రదోషకాలంలో లక్ష్మీదేవి సంచరిస్తుంది.  కార్తీకమాసం పూజలకు.. దీపారాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో దేవుడి దగ్గర.. తులసి మొక్క దగ్గర.. సాయంత్రం పూట ఇంటి గుమ్మం దగ్గర దీపాలు వెలిగించడం వలన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. సుఖసంతోషాలు, ఐశ్వర్యం కూడా కలుగుతాయనిపండితులు చెబుతున్నారు.  

కార్తీకమాసంలో ప్రతిరోజుప్రధాన గుమ్మం చాలా శుభ్రంగా ఉండాలి.  గుమ్మం దగ్గర చెప్పులు.. ఇతర వేస్ట్​ మెటీరియల్​ ఉండకూడదు.  చెప్పుల స్టాండ్​ ను దూరంగా ఉంచుకోవాలి.  ఇక గుమ్మానికి పసుపురాసి..కుంకుమ బొట్లు పెట్టాలి.  దీపం వెలిగించే ముందు ఇంటి ముందు అంటే గుమ్మందగ్గర ముగ్గు వేయాలి. ప్రధాన ద్వారానికి ఇరువైపులా రెండు దీపాలను వెలిగించాలి. దీపాలు అక్కడ పెట్టిన తరువాత కొద్దిగా నూనె వేసి.. దీపానికి పసుపు.. కుంకుమ.. పూలు సమర్పించి.. నమస్కారం చేయాలి.  రాత్రి 8 గంటల వరకు దీపం వెలుగుతూ ఉంటే మంచిదని పండితులు చెబుతున్నారు. 

దీపారాధనకు ఒక్కొక్కరు ఒక్కొక్క నూను వాడతారు.  అయితే కార్తీక మాసంలో ఆవునెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది.  శుభ్రమైన మట్టి ప్రమిదల్లోనే వెలిగించాలి.  దీపారాధనకు నువ్వులనూనె కూడా వాడవచ్చు.  ప్రతి ప్రమిదలో రెండు సాధరణ ఒత్తులు.. ఒకటి కుంభ ఒత్తి వేయాలి.   పత్తి వత్తులు వేసి దీపారాధన చేయాలని పండితులు సూచిస్తున్నారు.

కార్తీకమాసంలో సూర్యోదయానికి ముందు.. సూర్యాస్తమయం సమయంలో  తరువాత దీపారాధన చేయడం చాలా మంచిది.  సాయంత్రం ప్రదోషకాలంలో ... సంద్యా సమయంలో ప్రధాన ద్వారం దగ్గరే కాకుండా  పూజ మందిరం దగ్గర, తులసి కోట దగ్గర దీపారాధన చేయడం వలన ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోతుందని పురాణాల ద్వారా తెలుస్తుంది. 

►ALSO READ | ఆధ్యాత్మికం: మంచి సంతానం కలగాలా... కొత్త దంపతులు నవంబర్ 15న చేయాల్సింది ఇదే..!

తులసి కోటను హిందువులు లక్ష్మీదేవిగా భావిస్తారు. తులసి దగ్గర దీపాన్ని వెలిగించి ప్రదక్షిణలు చేయాలి.
కార్తీక మాసంలో శివాలయాల్లో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపాన్ని భగవంతుడికి సమర్పించే పవిత్రమైన దీపం అని అంటారు. ఆకాశ దీపంలో నూనె వేసినా .. ఆలయంలో వెలిగించిన ఆకాశ దీపాన్ని చూసి నమస్కారం చేసుకోవడం వలన కష్టాలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు.

ప్రతిరోజూ ఉదయం సూర్యోదయానికి ముందు  దీపారాధన చేసి నమస్కారం చేసుకోవాలి. అలాగే తులసి దగ్గర కూడా దీపారాధన చేయాలి. అలా చేయడం వలన లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది ఒక పరమేశ్వరుని అభిషేకం చేసి బిల్వ పత్రాలను సమర్పించి  ఈ నెల రోజు శివనామస్మరణతో గడిపితే మోక్షం కలుగుతుంది.  విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే  ప్రతికూలత తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు. 

దీపం వెలిగించేటప్పుడు చదవాల్సిన మంత్రం

దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహః!
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే!!

గుమ్మం దగ్గర పెట్టేటప్పుడు పాటించాల్సిన  నియమాలు

  • దీపం పెట్టేటప్పుడు ఆ ప్రదేశం శుభ్రంగా ఉండాలి
  • దీపాలను స్థిరంగా ఉండే ప్రమిదల్లో వెలిగించండి
  • గాలికి దీపాలు ఆరిపోకుండా జాగ్రత్తలు తీసుకోండి
  • దీపం వెలిగించాక నిర్లక్ష్యం చేయొద్దు

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.