కార్తీకమాసం కొనసాగుతుంది. ఈ నెల రోజులు చాలా పవిత్రమైన రోజులు ఏ రోజు విశిష్టత ఆరోజుకే ఉన్నా... ఈ ఏడాది వివాహమైన వారు కార్తీకమాసం శుక్ల పక్షం షష్ఠి రోజున కొన్ని ప్రత్యేకతలు పాటించాలని పండితులు చెబుతున్నారు. అలా పాటించడం వలన చక్కటి సంతానం కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ ఏడాది అలాంటి పవిత్రమైన రోజు నవంబర్ 15న వచ్చింది. మరి ఆ రోజు కొత్త దంపతులు పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం. . .!
కార్తీక మాసం అంటేనే పవిత్రతకు, భక్తికి ప్రతీక. అలాంటి మాసంలో వచ్చే షష్ఠి తిథికి సంతానం కోసం ఎదురుచూసే దంపతులకు విశేష ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ఈ ఏడాది వివాహం అయిన నూతన దంపతులు ఈ పూజ చేయడం వల్ల వంశాభివృద్ధి, సుఖ సంతాన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
కార్తీక షష్ఠి తిథి రోజున వల్లీదేవ సమేత శుబ్రమణ్యేశ్వర స్వామిని పూజించాలి. సంతాన కారకుడు, విఘ్నాలను తొలగించే దైవమని పురాణాల్లో చెప్పబడింది.సంతానం లేని దంపతులు, నూతనంగా పెళ్లైన వారు ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని, నాగ దేవతను ఆరాధించడం వల్ల సర్పదోషాలు, సంతాన దోషాలు తొలగి సంతాన యోగం కలుగుతుందనిపురాణాల ద్వారా తెలుస్తుంది.
ఈ ఏడాది వివాహం అయిన కొత్త జంటలుసంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులుజాతకంలో సర్పదోషం, నాగదోషం, కుజదోషం ఉన్నవారు కచ్చితంగా ఈ నియమాలు పాటించాలి. తెల్లవారుజామునూ లేచి కాలకృత్యాల అనంతరం సూర్యుడు ఉదయించడానికి ముందే తలస్నానంఆచరించి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించాలి. దగ్గరలో నదులు అందుబాటులో ఉంటే ఆ నదుల్లో చేయడం చాలా మంచిది. దంపతులిద్దరూ కలిసి సంతాన ప్రాప్తి కోసం సంకల్పం చెప్పుకోవాలి.
తరువాత దేవుడి మందిరంలో కార్తీక దామోదరుడిని.. వల్లీ దేవ సేన సమేత శుబ్రమణ్యేశ్వర స్వామిని అర్చించాలి. ఇంట్లో తులసికోట దగ్గర దేవుడి మందిరం దగ్గర ఆవునేయి దీపం వెలిగించాలి. స్వామికి పసుపు, కుంకుమ, ఆరు రకాల పూలు స్వామికి సమర్పించాలి. అవకాశం ఉంటే ఆరు దీపాలు వెలిగించాలి. స్వామికి పాలు, తేనె, అరటి పండ్లు సమర్పించాలి. శుబ్రహ్మణ్య స్తోత్రం పఠిస్తూ "ఓం శరవణభవాయ నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. స్కంద షష్ఠి కవచం పారాయణం చేయాలి
►ALSO READ | జ్యోతిష్యం: కన్యారాశిలో శుక్రుడి సంచారంలో మార్పు.. ఆరు రాశుల వారు పట్టింది బంగారమే..!
శివాలయానికి వెళ్లి అక్కడ బ్రహ్మచారి అర్చకునికి దక్షిణతో స్వయం ఎర్ర గడుల కండువాను దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. దంపతులిద్దరూ ఉపవాసం ఉండి సాయంత్రం దీపారాధన తర్వాత సాత్విక ఆహారం తీసుకోవాలి. నేలపై చాప వేసుకొని పడుకోవాలి. దంపతులు ఇద్దరూ ఒకే చోట పడుకోవాలి కాని ఆ రోజు శారీరకంగా కలవకూడదు.
ఇలా పూజ చేయడం వలన త్వరగా సంతాన యోగం కలుగుతుంది. గర్భంలోని శిశువుకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. దంపతుల మధ్య అన్యోన్యత, ఐక్యత పెరుగుతుందిసర్పదోషం, సంతాన అడ్డంకులు తొలగిపోతాయి. ఆరోగ్యవంతమైన, తేజోవంతమైన సంతానం కలుగుతుంది.కార్తీక మాసం అంతా శివకేశవులకు ప్రీతికరమైనది. అందులోనూ షష్ఠి తిథి నాడు భక్తితో చేసే ఈ చిన్న పూజతో మీ జీవితంలో తీరని సంతోషం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
