జ్యోతిష్యం: కన్యారాశిలో శుక్రుడి సంచారంలో మార్పు.. ఆరు రాశుల వారు పట్టింది బంగారమే..!

జ్యోతిష్యం:  కన్యారాశిలో శుక్రుడి సంచారంలో మార్పు.. ఆరు రాశుల వారు పట్టింది బంగారమే..!

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం...  సంపద.. ఐశ్వర్యానికి కారణమైన శుక్రుడు ఈ ఏడాది (2026) నవంబర్​ 14 వతేది  ఉదయం 6:00 గంటలకు రాశిలో తన దిశను మార్చుకున్నాడు.  కన్యారాశిలో తిరోగమనంలో సంచరిస్తున్న  శుక్రుడుప్రత్యక్ష స్థితిలోకి  మారడం వలన   మిథునం, కన్య, తుల, కుంభ, మకర, మీన రాశుల వారికి అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.   ఇప్పుడు ఆ రాశుల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . !

మిథున రాశి:  కన్యారాశిలో శుక్రుడు ప్రత్యక్ష స్థితిలోకి మారడం వలన ఈ రాశి వారికి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.. ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అధికంగా లాభాలు ఉంటాయి.  అనుకోకుండా కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.కేరీర్​ విషయంలో ఊహించనంత అభివృద్ది ఉంటుంది.  పూర్వీకుల ఆస్థి కలసి రావడంతో  కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పనులు పూర్తి చేస్తారు.  నిరుద్యోగులకు గడ్​ న్యూస్​ అందుతుంది.  విదేశాలకు వెళ్లాలన్న మీ డ్రీమ్ నెరవేరుతోంది. వైవాహిక జీవితంలో ఉన్న కలతలన్నీ తొలగిపోవడంతో చాలా ఆనందంగా గడుపుతారని పండితులు చెబుతున్నారు.

తులా రాశి:శుక్రుడు తన దిశను మార్చుకోవడం వలర ఈ రాశివారికి ఇబ్బందులు తొలగిపోతాయి.  ఆర్థిక విషయాల్లో ఊరట కలుగుతుంది.  కీలక సమస్యలు సామరస్యంగా పరిష్కారం కావడంతో మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. పనిలో ఎదురవుతున్న అడ్డంకులు మాయమవుతాయి. ఆర్థిక విషయాలకు సంబంధించి ప్రత్యేక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో కూడా పూర్తి ప్రయోజనం పొందే అవకాశం ఉంది. కార్యాలయంలో మీ పని ప్రశంసించబడుతుంది. దీనితో పాటు, మీరు మీ సహోద్యోగులతో బాగా కలిసిపోతారు. సీనియర్ అధికారుల సహకారంతో మీ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. కెరీర్‌లో చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అప్పుల బాధ నుంచి ఉపశమనం పొందడం ద్వారా ఆర్థిక స్థితి బలపడుతుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసివస్తాయి.

కన్య రాశి:  ఇదే రాశికి సంపదకు కారణమైన శుక్రుడు తన  దిశను మార్చుకోవడం వలన ఈ రాశి వారికి అదృష్టం తన్నకొస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఉద్యోగస్తులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త వింటారు. అనుకోకుండా వ్యాపారాలు పుంజుకుంటాయి. గతంలో చేసిన పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది.జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి.  అన్ని రంగాల్లో అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. అన్ని విధాలుగా వీరికి బాగుటుంది. ధన లాభం కలుగుతుంది. ఆగిపోయిన పనులు కూడా మళ్లీ ప్రారంభిస్తారు. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి. ఉద్యోగస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.  వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని పండితులు చెబుతున్నారు.

మకర రాశి: శుక్రడు దిశ మార్పు ఈ  రాశి వారికి  కెరీర్ పరంగా స్వర్ణయుగమని పండితులు చెబుతున్నారు.  ఉద్యోగస్తులు ప్రమోషన్​ తో పాటు ఆదాయం పెరిగే సూచనలున్నాయి. వ్యాపారస్తులు  కొత్త గాపెట్టుబడులు పెట్టేవారికి భారీగా లాభాలు వస్తాయి. . ఒక్కసారిగా మీ ఆదాయం కూడా పెరుగుతుంది. వ్యక్తిగత  జీవితంలో సానుకూల మార్పులు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు... వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు మొదలు పెట్టే ఎలాంటి పనుల్లోనైనా విజయాలు సాధిస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. మీరు ఊహించని విధంగా డబ్బు పెరిగే అవకాశాల కూడా ఉన్నాయి. పెళ్లి కోసం ఎదరు చూసే వారు బంధువర్గంలోనే మంచి సంబంధం కుదురుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

కుంభ రాశి: శుక్రుడి సంచారంలో మార్పు వలన ఈ రాశి వారికి చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. విలువైన స్థిరాస్థులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.  వ్యాపారంలో ఊహించని విజయాన్ని పొందే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆకస్మిక విజయం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. భౌతిక ఆనందాన్ని పొందుతారు. వృత్తి, వ్యాపారంలో మెరుగుదల, పురోగతి మార్గంలో ముందుకు సాగుతారు. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. కార్యాలయంలో గౌరవం కూడా లభిస్తుంది.. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టుకోవడం వల్ల సంపన్నులయ్యే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ఆనందమయంగా సాగుతుంది.

మీన రాశి: ఈ రాశి వారికి శుక్రుడు కన్యారాశిలో ప్రత్యక్ష్య దిశలోకి మారడం వలన గతంలో ఆగిపోయిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. వ్యాపారస్తులకు అధికంగా లాభాలు ఉంటాయి.ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశాలు బలంగా ఉన్నాయి. అదనంగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది.పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది.  కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.  కొత్తగా పెట్టుబడి పెట్టడం వలన అధికంగా లాభాలు వస్తాయి. శుక్రుడి శుభ ప్రభావం వల్ల జీవితంలో ధన ప్రవాహం పెరుగుతుంది. సౌలభ్యం కూడా పెరుగుతుంది. ఆకస్మికంగా ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. కెరీర్‌లో పురోగతి సాధించే అవకాశం కూడా ఉంటుంది. ఆర్థిక స్థితి మరియు కుటుంబ జీవితం మెరుగుపడుతుంది. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.