హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో మొబైల్ షాప్‌లో దొంగలు రెచ్చిపోయారు. గోడకు కన్నం వేసి దుకాణంలోకి ప్రవేశించిన దుండగులు సుమారు రూ.2 లక్షల విలువైన మొబైల్ ఫోన్లు, యాక్సెసరీస్‌ను అపహరించారు. అంతేకాకుండా, చోరీ దృశ్యాలు రికార్డు కాకుండా సీసీ కెమెరాల వైర్లను కత్తిరించి, డీవీఆర్‌ను సైతం ఎత్తుకెళ్లారు. ఈ ఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
దిల్‌సుఖ్‌నగర్ ప్రధాన రహదారిపై ఉన్న శ్రీ సాయి అపర్ణ స్వప్న మొబైల్స్ షాప్‌లో ఈ చోరీ జరిగింది. షాప్ యజమాని చింతకాయల సాయికి చెందిన దుకాణం వెనుక గోడకు రంధ్రం చేసిన దొంగలు.. లోపలికి ప్రవేశించి మొబైల్ ఫోన్లు, పలు రకాల యాక్సెసరీస్‌ను దోచుకెళ్లారు.
షాపులోని సుమారు రూ.2 లక్షల విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు యజమాని తెలిపారు. దొంగలు పక్కా ప్రణాళికతోనే ఈ చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. చోరీ జరిగిన సమయంలో సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డు కాకుండా వాటి వైర్లను కత్తిరించడంతో పాటు, డీవీఆర్‌ను కూడా తీసుకెళ్లారు.
ALSO READ : మన ఇళ్లలో, గుళ్లలో చూస్తున్న వెంకటేశ్వరస్వామి చిత్రపటాలను గీసిన పెద్దాయన ఇక లేరు !
చోరీ విషయాన్ని గుర్తించిన షాప్ యజమాని చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దొంగలను గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
