బెంగళూర్: ప్రధాని మోడీ బెంగళూర్ పర్యటనను ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పరోక్షంగా ఎద్దేవా చేశారు. ఒక స్టేషన్ మాస్టర్ చేయాల్సిన పనికి కూడా మోడీ వెళ్తున్నారని సెటైర్ వేశారు. మోడీ ప్రసంగానికి ప్రాంప్టర్ ఇప్పటికే సిద్ధంగా ఉందని వ్యంగ్యస్త్రాలు సంధించారు. తాను మాత్రం ‘వాయిసెస్ ఆఫ్ రెసిస్టెన్స్: హౌ జెన్-జెడ్ ఈజ్ రీషేపింగ్ ఇండియన్ డెమోక్రసీ’ అనే ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు లండన్ వెళ్తున్నానని తెలిపారు. ఈ మేరకు ఫ్లైట్‌లో ఒక వీడియో రికార్డ్ చేసి ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ వీడియోలో.. మరో వ్యక్తితో మాట్లాడిన ఆయన.. హాయ్ ఫ్రెండ్ అంటూ ఇన్‌డైరెక్ట్‌గా ప్రధాని మోడీని ఇమిటేట్ చేశాడు. హౌ జెన్-జెడ్ ఈజ్ రీషేపింగ్ ఇండియన్ డెమోక్రసీ అనే కార్యక్రమంలో పాల్గొనాలని తనను ఆహ్వానించారని.. ఇందుకు కోసం లండన్ వెళ్తున్నానని చెప్పారు. మరో వ్యక్తిని నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని ప్రకాష్ రాజ్ ప్రశ్నించగా.. బెంగళూరులో మెట్రో లైన్ ప్రారంభించడానికి వెళ్తున్నానని సమాధానం ఇచ్చాడు.
ఆ చిన్న పనిని ఒక స్టేషన్ మాస్టర్ కూడా చేయగలరని ప్రకాష్ రాజ్ సెటైర్ వేశారు. మరీ స్పీచ్ ప్రిపేర్ అయ్యారా అని ప్రకాష్ రాజ్ అడగగా.. ప్రాంప్టర్ రెడీగా ఉందని సదరు వ్యక్తి సమాధానం ఇచ్చారు. పరోక్షంగా ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ ప్రకాష్ రాజ్ సర్కాస్టిక్‌గా చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై భిన్నభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. ఈ రేంజ్ లో ర్యాంగింగ్ ఎక్కడ చూడలేదంటూ ప్రకాష్ రాజ్ సపోర్టర్స్ కామెంట్స్ చేస్తుండగా.. ప్రతి దానిని రాజకీయం చేయడం అలవాటుగా మారిందని బీజేపీ, మోడీ అభిమానులు ప్రకాష్ రాజ్‌పై మండిపడుతున్నారు.
2026, నవంబర్ 13న ప్రధాని మోడీ బెంగళూరులో పర్యటించాడు. రూ. 15,600 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. బెంగళూరు మెట్రో పింక్ లైన్లో భాగంగా సుమారు రూ. 3,470 కోట్ల వ్యయంతో నిర్మించిన కలేన అగ్రహార నుండి తవరేకెరె వరకు ఉన్న 7.5 కిలోమీటర్ల ఎలివేటెడ్ మార్గాన్ని ప్రధాని ప్రారంభించారు. అలాగే, కర్ణాటక-గోవా మధ్య పర్యాటకం, ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరిచేందుకు బెంగళూరు (యశ్వంత్‌పూర్) – మంగళూరు – మడ్‌గావ్ (గోవా) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. బెంగళూరులోని హరలకుంటెలో గెయిల్ నిర్మించనున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు.
ఈ రేంజ్లో ర్యాగింగ్ ఏంటి సామీ: వైరల్‌గా ప్రకాష్ రాజ్ వీడియో https://t.co/SFUZefdpR7
— Prabhatha Velugu (@v6velugu) November 13, 2026
