ఇంటి నిర్మాణంలో చిన్న చిన్న వాస్తు విషయాలలో కూడా చాలామంది శ్రద్ధ వహిస్తుంటారు. అయితే ఇంటి ముందు రేకుల పందిరి ఎలా వేసుకోవాలి? ఇంట్లో వాడిన నీళ్లు ఏ దిశగా వెళ్లాలి? వాస్తు ప్రకారం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం...
రేకులతో తాత్కాలికంగా..
ఇంటి ముందు, ప్రధాన ద్వారాన్ని ఆనుకుని రేకులతో ఎప్పటికీ ఉండేలా పందిరి ఏర్పాటు చేసుకోవచ్చా? లేదా అవసరాలకు మాత్రమే తాత్కాలికంగా ఏర్పాటు చేసుకోవడం మంచిదా?
ఇంటి ఫేసింగ్ రోడ్డుకి ఎటువైపు ఉందనే దాన్నిబట్టి, ఇంటిముందు పందిరి వేసే విషయంలో నిర్ణయం తీసుకోవాలి. అలాగే అది పర్మినెంట్‌గా ఉండేలా చేస్తున్నారా ? లేదా తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నారా ? అనేది చూడాలి. ఎప్పటికీ ఉండేలా వేసుకోవాలి అనుకుంటే ఇంటి మెయిన్ వాల్‌కు తగలకుండా పందిరి ఏర్పాటు చేసుకోవచ్చు.
►ALSO READ | కార్తీక మాసంలో ఉపవాసాలు మంచిదే కానీ.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
వాడిన నీళ్లు ఎటువైపు వెళ్లాలి?
పడమర వైపు మా ఇంటి మెయిన్ డోర్ ఉంది. ఇంట్లో వాడిన నీళ్లు ఎటువైపు వెళ్లేలా ఏర్పాటు చేసుకోవాలి?
ఇంట్లో వాడిన నీళ్లు వెళ్లేందుకు వాస్తు విషయంలో కొన్ని రూల్స్ ఉన్నాయి. వాడిన నీళ్లు పడమర నుంచి తూర్పు వైపు వెళ్లేలా పైపులు ఏర్పాటు చేసుకోవాలి. లేదంటే దక్షిణం నుంచి ఉత్తరం వైపు వెళ్లేలా అయినా ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఈ రెండు వైపులా మాత్రమే వాలు ఉండేలా చేసుకుని, ఇంట్లోంచి నీళ్లు బయటకు వదిలేలా చూడాలి.
కాశీనాథుని శ్రీనివాస్
వాస్తు కన్సల్టెంట్
94400 88799
