Night Food: వింటర్ సీజన్.. హెల్దీఫుడ్..లెమన్ పెప్పర్ రసం రైస్ .. జస్ట్ 20 నిమిషాల్లో తయారీ

Night  Food: వింటర్ సీజన్..  హెల్దీఫుడ్..లెమన్ పెప్పర్ రసం రైస్ .. జస్ట్ 20 నిమిషాల్లో తయారీ

నైట్ టైం లైట్​ ఫుడ్​ తీసుకోవాలని చెబుతుంటారు.  రాత్రి అన్నం కూర తింటే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.  పగలంతా కష్టపడ్డ మహిళలు రాత్రి పూట ఎక్కువ టైం కిచెన్​ లో ఉండాలంటే విసుగొస్తుంది.  మరి అలాంటప్పుడు టేస్టీగా ఉండే హెల్దీ  లైట్​ ఫుడ్​ను నిమ్మకాయ, మిరియాల రసంతో లెమన్​ పెప్పర్​ రసం రైస్​ జస్ట్​ ట్వంటీ మినిట్స్​ లో   ఎలా తయారుచేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..!

 
నిమ్మకాయ పెప్పర్​ రైస్​తయారీకి కావాల్సిన పదార్థాలు

  •  బియ్యం : రెండు కప్పులు
  •  కందిపప్పు : 10 టేబుల్​ స్సూన్లు
  • నీళ్లు : సరిపడ
  • టమాటోలు: నాలుగు
  •  పసుపు : ఒక టేబుల్​ స్పూన్​
  • మిరియాలు: ఒక టేబుల్​ స్పూన్​
  •  ఆవాలు : రెండు టేబుల్​ స్పూన్లు
  •  జీలకర్ర : రెండు టేబుల్​ స్పూన్లు
  • ఎండుమిర్చి : 10‌‌
  • రసం పొడి: రెండు టేబుల్​ స్పూన్లు
  •  నెయ్యి : 10 టేబుల్​ స్పూన్లు
  • జీడిపప్పు: 8
  •  కొత్తిమీర : కొద్దిగా
  • ఉప్పు : సరిపడ

లెమన్​ పెప్పర్​ రసం రైస్​ తయారీ విధానం

ఒక రెండు కేజీలు పట్టే గిన్నెలో బియ్యం, కందిప్పు కలిపి నీటితో శుభ్రంగా కడగాలి.  ఆ తరువాత ఆ గిన్నె నిండుగా నీరు పోసి గంటసేపు నానబెట్టాలి.  నానిన తరువాత నీళ్లను పూర్తిగా తీసేసి రైస్​ కుక్కర్​ లో వేసుకోవాలి. 

 ఇందులో రెండు టమాలను ముక్కలు తరిగి వేయాలి.  అన్నం ఉడికేలా నీళ్లు పోసే విధంగా  వాటర్​ పోయాలి.  ఇందులోనూ పసుపుకూడా వేసి బాగా కలిపి కుక్కర్​ మూత పెట్టాలి.
మీడియం మంట మీద నాలుగు లేదా ఐదు  విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టాలి. 

మరో పక్క స్టవ్​పై వెడల్పాటి మూకుడు బెట్టి  అందులో మిరియాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి సన్నని మంటపూ వేయించాలి.  జీలకర్ర, మిరియాలు చిట్లిన తర్వాత  మిక్సీ జార్ లో వేసి కచ్చాపచ్చగా  పొడి చేయాలి. ఇప్పుడు కుక్కర్​ లో ఉడికిన అన్నాన్ని గరిటతో మెత్తగా చేయండి.  తరువాత మరో బౌల్​లోకి రసం పొడి వేసి 8 స్పూన్ల నీళ్లు పోసి గడ్డలు లేకుండా కలపాలి. 

►ALSO READ | జ్యోతిష్యం: మానసిక ప్రశాంతత లభిస్తుంది.. నెగిటివ్థాట్స్ రానే రావు.... చేయాల్సినవి ఇవే..!

ఇప్పుడు పోపు పెట్టేందుకుకు మూకుడులో  నెయ్యి  వేడెక్కిన జీడిపప్పును ఎర్రగా వేయించాలి. ఇందులో ఆవాలు, ఎండిమర్చి ముక్కలు రంగుమారే వరకువేయించాలి.  ఎండుమిర్చి రంగు మారుతున్నప్పుడే అందులో కరివేపాకు ,  దంచిన వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు ఇంగువ వేసి వేయించాలి .

ఇప్పుడు అన్నం మిశ్రమంలో పోపు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులోనే లీటరుకు పైగా  వేడి నీళ్లు పోసి అన్నాన్ని నీళ్లలో కలిసిపోయేంతవరకు గరిటతో బాగా కలుపుతూ  రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర తరుగు, ముందుగా దంచిన మిరియాల మిశ్రమం పొడిని వేసుకుంటూ బాగా కలపాలి. ఆ తరువాత మరో రెండు నిమిషాలు పాటు ఉడకబెట్టాలి.  

కొంచెం జారుగా ఉన్నప్పుడే  కొత్తిమీర, అవసరాన్ని బట్టి కొంచెం నిమ్మరసం వేసి కలిసిన తరువాత  వేయించిన జీడిపప్పు వేసుకోవాలి.  ఇక అంతే నిమ్మకాయ పెప్పర్​ రైస్రడీ.. ఇది పుల్లపుల్లగా కార కారంగా ఉంటుంది.  దీనిని ఎలాంటి కర్రీ లేకుండానే తినేయచ్చు.  రుచితో పాటు వింటర్​ సీజన్​ హెల్దీపుడ్​..లెమన్ పెప్పర్ రసం రైస్..