యాదాద్రి లక్ష్మీ నరసింహుడికి రెండు కొత్త సేవలు.. తోమాల సేవ, తులాభార సేవ పునరుద్దరణ

యాదాద్రి లక్ష్మీ నరసింహుడికి రెండు కొత్త సేవలు.. తోమాల సేవ, తులాభార సేవ పునరుద్దరణ

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో తులాభారం,తోమాల సేవను పునరుద్ధరించినట్టు  ఈఓ భవాని శంకర్,ఆలయ అర్చకులు తెలిపారు.  గత సంవత్సరం( 2025) డిసెంబర్ లో ఈసేవలు  ప్రారంభమైన కొన్ని రోజులకే నిలిచిపోయాయి.  నిలిచిపోయిన తులాభారం, తోమాల సేవలను పునప్రారంభించిన ఆలయ అధికారులు, అర్చకులు  భక్తులకు అందుబాటులో తెచ్చారు.

తోమాల సేవ వివరాలు

 తోమాల సేవకు రూ. 1250 టికెట్ తో దంపతులు పాల్గొనే అవకాశాన్ని కల్పించారు. ఈ  టికెట్ తీసుకున్న భక్తులకు గర్భాలయ ప్రవేశంతో పాటు,స్వామి వారి శాలువా ,కునుమ పాటు అభిషేకం లడ్డు అందజేస్తారు. తోమాల సేవ  ప్రతి రోజు ఉదయం నిత్యా సహస్రనామార్చన అనంతరం అరగంట పాటు గర్భాలయంలో నిర్వహిస్తారు.

తులాభారం సేవ వివరాలు

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి భక్తుల కోరిక మేరకు స్వామివారి సన్నిధిలో తులాభార సేవను పునరుద్ధరించినట్టు  ఆలయ ఈఓ భవానిశంకర్  తెలిపారు. ఈ సేవద్వారా భక్తులు  తమ మొక్కులను చెల్లించుకోవచ్చని వెల్లడించారు.  పునరుద్ధరించిన ఆర్జిత సేవలను భక్తులు సద్వినియోగం చేసుకొని స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని ఆలయ ఈవో కోరారు.