వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్కు కూతవేటు దూరంలో కాల్పుల మోత మోగింది. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో గురువారం ఉదయం కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. వాషింగ్టన్లోని ప్రముఖ నివాస, వాణిజ్య ప్రాంతమైన లోగన్ సర్కిల్‌లో గుర్తుతెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఐదుగురు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు కేవలం ఒక మైలు దూరంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో భద్రతా వర్గాల్లో ఆందోళన రేకెత్తింది.
Police and SWAT teams are confronting a barricaded gunman in Washington, D.C.’s Logan Circle after five people were shot near a VIDA Fitness gym. Authorities have locked down nearby schools, closed streets, and ordered residents to shelter in place as the investigation continues.
— Aditya Kumar Trivedi (@adityasvlogs) November 12, 2026
గురువారం తెల్లవారుజామున లోగన్ సర్కిల్ పరిసరాల్లో కాల్పుల శబ్దాలు వినిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. 15th స్ట్రీట్, పీ స్ట్రీట్ పరిసరాల్లో కాల్పుల ఘటనలు జరిగినట్లు ప్రాథమిక సమాచారం. తొలుత నలుగురు వ్యక్తులు ఈ కాల్పుల్లో గాయపడినట్లు వార్తలు వచ్చినప్పటికీ, బాధితుల సంఖ్య ఐదుకు చేరినట్లు పోలీసులు ప్రకటించారు. కాల్పులు ఒకే చోట జరిగాయా? లేక పరిసర ప్రాంతాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగాయా? అనే విషయంపై స్పష్టత రాలేదు. పోలీసులు పలు ప్రాంతాల్లో దర్యాప్తు చేపట్టారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై కూడా ప్రాథమిక నివేదికల్లో పూర్తి వివరాలు వెల్లడించలేదు.
#BREAKING: Five people have been shot in a shooting incident in Washington, D.C., near the White House. The gunfire reportedly erupted in the upscale Logan Circle neighbourhood, around a mile north of the White House. The suspect remains at large, and police are investigating multiple reported shooting locations. #WashingtonDC #USA
— Indian Observer (@ag_Journalist) November 12, 2026
ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితుడు సమీపంలోని ఓ భవనంలో తలదాచుకున్నట్లు, అక్కడే బారికేడ్ చేసుకున్నట్లు అమెరికా మీడియా వర్గాలు వెల్లడించాయి. పోలీసుల ఎమర్జెన్సీ టీమ్స్ రంగంలోకి దిగాయి. ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పోలీసు వాహనాలు మోహరించాయి. భద్రతా సిబ్బంది దగ్గరలోని బిల్డింగ్స్ దగ్గర పహారా కాశారు. నిందితుడిని పట్టుకునే వరకు పరిసర ప్రాంతాల ప్రజలు పోలీసుల సూచనలను పాటించాలని, అప్రమత్తంగా ఉండాలని భద్రతా వర్గాలు సూచించాయి. అమెరికా రాజధాని నడిబొడ్డున ఈ కాల్పుల ఘటన జరగడంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి.
JUST IN: Four people have been SHOT in Washington D.C. just one mile from the White House. A heavy police presence is on the scene in the Logan Circle neighborhood and more information is still developing. https://t.co/VAmObNsdbh
— Benny Johnson (@bennyjohnson) November 12, 2026
